సత్యదేవుడి సన్నిధిలో డీఎస్పీల జంట పూజలు
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:53 PM
అన్నవరం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు డీఎస్పీలు ప్రేమించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కటైన జంట మంగళవారం కాకినాడ జిల్లా అన్నవరం
అన్నవరం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు డీఎస్పీలు ప్రేమించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కటైన జంట మంగళవారం కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో వ్రతమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం కృష్ణాజిల్లా అవనిగడ్డ డీఎస్పీగా పనిచేస్తున్న విద్యశ్రీ, పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీగా పనిచేస్తున్ప జగదీష్‌లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరుపెద్దల అంగీకారంతో వారు ఒక్కటయ్యారు. వారికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయగా దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. ఒకే క్యాడర్ గల అధికారుల ప్రేమవివాహం విశేషంగా మారింది.