డీఎస్సీ షెడ్యూల్ విడుదల
ABN , Publish Date - Apr 20 , 2025 | 01:09 AM
రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఎదురుచూస్తున్న కొన్ని లక్షల మంది అభ్యర్థుల కల నెలవేరింది.
నోటిఫికేషన్‌కు అనుమతి జారీ
కాకినాడ రూరల్, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఎదురుచూస్తున్న కొన్ని లక్షల మంది అభ్యర్థుల కల నెలవేరింది. డీఎస్సీ నోటిఫికేషన్‌కు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఆదివారం ఉదయం నోటిఫికేషన్ విడుదలవుతుంది.రాష్ట్రవ్యాప్తంగా 16,347 వరకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయనున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజుల తరువాత పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఖాళీలివే....
మొత్తం 1,241 ఉపాధ్యాయ పోస్టులను డీ ఎస్సీ ద్వారా భర్తీచేయనున్నారు.స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి తెలుగు 65, హిందీ 78, ఆం గ్లం 95, గణితం 64, ఫిజికల్ సైన్స్ 71, బయాలాజికల్ సైన్స్ 103,సోషల్ స్టడీస్ 132, వ్యా యామ విద్య 210, ఎస్జీటీలు 423 డీఎస్సీ ద్వారా భర్తీకానున్నాయి.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ సంబంధించి ఫిజికల్ సైన్స్ 3,బయోలాజికల్ సైన్స్ 4, స్కూల్ అసిస్టెంట్ వ్యాయామవిద్య 1, ఎస్జీటీలు 104 మొత్తం 112 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీచేయనున్నారు.ప్రత్యేక విద్యకు సంబందించి రాష్ట్రవ్యాప్తంగా 13 టీజీటీలు, 3 పీఈటీలు, 15 ఎస్‌జీ టీలతో కలిపి మొత్తం 31 పోస్టులు భర్తీకానున్నాయి.జోన్ 2(ఉమ్మడి ఈస్ట్, వెస్ట్, కృష్ణా)కి సంబంధించి ఏపీఆర్‌ఎస్, ఏపీఎంఎస్, ఏపీఎస్‌డబ్ల్యు, బీసీ, సోషల్ వెల్ఫేర్‌కు సంబంధించి పీజీటీ 49, టీజీటీ 272, పీడీ 3, పీఈటీ 24లతో కలిసి 348 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారు.