డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 93మంది హాజరు
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:52 AM
గొల్లప్రోలు రూరల్, సెప్టెంబరు 2 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా డీఎస్సీ 2025 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మెరిట్ అభ్యర్థుల రెండో విడత సర్టిఫికెట్లు వెరిఫికేషన్ మంగళవారం నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి 10గంటల వరకూ జరి
రాత్రి వరకూ కొనసాగిన తనిఖీ
గొల్లప్రోలు రూరల్, సెప్టెంబరు 2 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా డీఎస్సీ 2025 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మెరిట్ అభ్యర్థుల రెండో విడత సర్టిఫికెట్లు వెరిఫికేషన్ మంగళవారం నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి 10గంటల వరకూ జరిగిన ఈ పక్రియకు 93మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎం ఈవో, గెజిటెట్ హెచ్‌ఎం, డిప్యూటీ తహశీల్దార్, ఎంఐఎస్ ఆపరేటర్లతో కూడిన 5 తనిఖీ బృందా లు అభ్యర్థుల పరిశీలన చేపట్టారు. సోమవారం సాయంత్రం నుంచి అభ్యర్థులకు కాల్‌లెటర్లు జన రేట్ కాగా వారంతా వచ్చి సర్టిఫికెట్లను వెరిఫై చే యించుకున్నారు. తనిఖీ వివరాలను ఈ బృందా లు ఆన్‌లైన్ చేశారు. తనిఖీ జరుగుతున్న తీరుని కాకినాడ జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్, డీసీఈబీ కార్యద వెంకట్రావు పరిశీలించగా, గొల్లప్రోలు ఎంఈవో శివప్రసాద్ తదితరులున్నారు.
విమానంలో వచ్చి...
కాల్‌లెటర్లు అయిన అభ్యర్థులు కొంతమంది ఆన్‌లైన్‌లో వాటిని డౌన్‌లోడ్ చేసుకోలేదు. హాజ రు కాని వారి వివరాలు గుర్తించిన తనిఖీ బృం దాల్లోని ఎంఈవోలు అభ్యర్థులకు ఫోన్‌లో సమాచారం అందించారు. చివరి క్షణంలో సమాచారం అందడంతో హైదరాబాద్‌లో ఉండిపోయిన ఇద్ద రు అభ్యర్థులు విమానంలో రాజమహేంద్రవరం వరకూ వచ్చి అక్కడ నుంచి కారులో చేబ్రోలుకు మంగళవారం రాత్రి చేరుకున్నారు. మరో అభ్యర్థి శ్రీకాకుళంలో ఉండగా సమాచారం అందడంతో కారులో నేరుగా హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న పలువురు ఆలస్యంగానే తనిఖీకి వచ్చారు. రాత్రి పది గంటలకు పక్రియ పూర్తైంది.