సంతోషంగా చలో..
ABN , Publish Date - Sep 25 , 2025 | 01:17 AM
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2025లో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థుల విజయవాడ ప్రయాణానికి ఏర్పాట్లు పూర్తి చేశామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డా.కీర్తి చేకూరి తెలిపారు. రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న నియా మక పత్రాల జారీ కార్యక్రమానికి ఉమ్మడి తూ ర్పు గోదావరి నుంచి ఉపాధ్యాయ అభ్యర్థి,
డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులు విజయవాడకు పయనం
రాజమహేంద్రవరంలో ఏర్పాట్లు
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2025లో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థుల విజయవాడ ప్రయాణానికి ఏర్పాట్లు పూర్తి చేశామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డా.కీర్తి చేకూరి తెలిపారు. రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న నియా మక పత్రాల జారీ కార్యక్రమానికి ఉమ్మడి తూ ర్పు గోదావరి నుంచి ఉపాధ్యాయ అభ్యర్థి, ఒక సహాయకుడు/సహాయకురాలితో బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరంలో ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన బస కేంద్రాల వద్ద రిజిసే్ట్రషనుకు హాజరుకావడం జరిగిందన్నారు. రాత్రి వసతి, భోజనం, గురువారం ఉదయం టిఫిన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి బస్సుకు ఒక పర్యవేక్షకుడిని నియమించామ న్నారు. అభ్యర్థులకు ఇబ్బంది కలగకు ండా జిల్లా నోడల్ అధికారులు శ్రద్ధ తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ఆయా పాఠశాలలను కలెక్టర్ సందర్శి ంచి వసతి ఏర్పాట్లను పరిశీలించారు. ఉపాధ్యాయ అభ్యర్థులతో ముచ్చటించారు.