నేరము..శిక్ష!
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:55 AM
ఈ చిత్రంలో పనిచేస్తున్న వారిని చూస్తుంటే ఏదో పారిశుధ్య కార్మికుల్లా అనిపిస్తున్నారు కదా..మరి పోలీసులెందుకు ఉన్నారనే అను మానం వస్తుందా..
నిడదవోలు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ఈ చిత్రంలో పనిచేస్తున్న వారిని చూస్తుంటే ఏదో పారిశుధ్య కార్మికుల్లా అనిపిస్తున్నారు కదా..మరి పోలీసులెందుకు ఉన్నారనే అను మానం వస్తుందా.. వారితో పనిచేయించ డానికే.. పారిశుధ్య కార్మికులతో పనిచేయిం చడం పోలీసుకెందుకంటారా.. అక్కడే ఉంది అసలు కిటుకు.. ఇంతకీ వాళ్లు పారిశుధ్య కార్మికులు కాదండోయ్.. మద్యం సేవించి వాహనాలు నడిపితే కోర్టులు ఇప్పటి వరకు జరిమానా విధించడమే చూశాం. కానీ జరి మానాతో పాటు కమ్యూనిటి సర్వీసు చేయా లని శిక్ష విధించారు ఓ జడ్జి. నిడదవోలు పట్టణ సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్ల పరి ధిలో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 13 మంది యువకులను శుక్రవారం పోలీసులు పట్టణం లోని కోర్టులో హాజరు పరిచారు. స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అజయ్‌కుమార్ యువతలో మార్పు తీసుకొ చ్చేందుకు ఒకొక్కరికి రూ.300 ఫైన్‌తో పాటు మునిసిపాలిటీ పరిధిలో ఒక పూట కమ్యూ నిటి సర్వీస్ చేయాలని శిక్ష విధించారు. దీంతో పోలీసులు సంత మార్కెట్ వద్ద వారి తో మొక్కలను కొట్టించి ఆ ప్రాంతమంతా శుభ్రం చేయించారు.పట్టణ ఎస్‌ఐ జగన్మో హనరావు, మునిసిపల్ ఏఈ హేమంత్, కానిస్టేబుళ్లు పర్యవేక్షించారు.