Share News

చినుకు పడితే చెరువే..

ABN , Publish Date - Sep 14 , 2025 | 01:08 AM

కాతేరు గ్రామంలో చిన్నపాటి వర్షం కురిసినా నీరు పోయే మార్గం లేక వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అభివృద్ధి అంతా స్థానిక నాయకులు కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. వివరాల్లోకి వెళితే రాజమహేంద్ర వరం రూరల్‌ మండలం కాతేరు పంచాయతీ పరిధి వేణుగోపాలపు రం, వేగివారి వీ ధి, హైస్కూల్‌ తదితర ప్రాం తాల్లో శనివారం కురిసిన భారీ వర్షానికి వీధులన్నీ జలమ యమయ్యాయి.

 చినుకు పడితే చెరువే..
కాతేరులోని ఓ వీధిలో రహదారిపై నిలిచిపోయిన వర్షం నీరు

  • కాతేరులో భారీ వర్షం

  • డ్రైనేజీలు లేక ఇబ్బందులు

  • వీధులన్నీ జలమయం..

  • కీటకాలు, పాములు సంచారం.. గ్రామస్థుల్లో భయాందోళన

రాజమహేంద్రవరం రూరల్‌, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): కాతేరు గ్రామంలో చిన్నపాటి వర్షం కురిసినా నీరు పోయే మార్గం లేక వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అభివృద్ధి అంతా స్థానిక నాయకులు కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. వివరాల్లోకి వెళితే రాజమహేంద్ర వరం రూరల్‌ మండలం కాతేరు పంచాయతీ పరిధి వేణుగోపాలపు రం, వేగివారి వీ ధి, హైస్కూల్‌ తదితర ప్రాం తాల్లో శనివారం కురిసిన భారీ వర్షానికి వీధులన్నీ జలమ యమయ్యాయి. ఈ ప్రాంతాల్లో గత పాలకులు రోడ్లు నిర్మాణాలు చేపట్టా రు గాని డ్రైనేజీలు నిర్మించలేదు. కనీసం కచ్చాడ్రయిన్లు కూడా పూర్తి స్థాయిలో లేకపోవడంతో నీరెళ్లే మార్గం లేక రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో ఏపుగా పెరిగాన చెట్లు, చెత్త చెదారంగా ఉండడంతో క్రిమి కీటకాలు, పాములు వస్తున్నాయని, మరోవైపు అంటురోగాలు ప్రబలుతున్నాయని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమ ప్రాంతంలో ముంపు సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Sep 14 , 2025 | 01:08 AM