Share News

గొంతెండుతోంది..

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:08 AM

పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన మండలంలోని వెలుగుబంద పంచాయతీ పరిధిలో నూతనంగా నెలకొల్పిన జగనన్న కాలనీవాసులను తాగు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. కాలనీలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో అక్కడక్కడా అరకొరగా చేపట్టిన ఇళ్లలో నివాసిం చేందుకు లబ్ధిదారులు నిరాకరిస్తున్నారు.

 గొంతెండుతోంది..
వెలుగుబందలో లేఅవుట్‌

  • వెలుగుబంద లేఅవుట్‌లో దాహార్తి

  • 13 వేలు మంది లబ్ధిదారులు

  • 2 ట్యాంకుల ద్వారా నీటి సరఫరా

  • జగనన్న కాలనీవాసులను వెంటాడుతున్న తాగునీటి కష్టాలు

రాజానగరం, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన మండలంలోని వెలుగుబంద పంచాయతీ పరిధిలో నూతనంగా నెలకొల్పిన జగనన్న కాలనీవాసులను తాగు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. కాలనీలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో అక్కడక్కడా అరకొరగా చేపట్టిన ఇళ్లలో నివాసిం చేందుకు లబ్ధిదారులు నిరాకరిస్తున్నారు. వెలుగు బంద లేఅవుట్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 13 వేలు మంది లబ్ధిదారులకు సంబంధించి 9 బోర్లు ఏర్పాటు చేసి, 5 మంచినీటి ట్యాంకులను నిర్మించారు. వీటిలో ప్రస్తుతం రెండు ట్యాంకుల నుంచి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కొంతమంది లబ్ధిదారులు ట్యాంకుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. వెలుగు బంద లేఅవుట్లో వేలాది మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ప్లాట్లు కేటాయించినప్పటికి కేవలం 100-150 మంది మాత్రమే అక్కడక్కడ ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుని ఇం టికి కు ళాయి ఏర్పాటు చేసింది. మంచి నీటి ట్యాంకర్లపై ఉండే క్లీనర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నారని కాలనీవాసులు ఆవే దన చెందుతున్నారు. ఉచితంగా అం దించాల్సిన నీటిని టిన్నుల పరి మాణాన్ని బట్టి రూ.50, రూ.100, రూ.300 వరకు లబ్ధిదారుల నుంచి వసూలు చేస్తున్నారని కాలనీవా సులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత వేసవిలో మంచి నీటి ఎద్దడి తలెత్తి ఇబ్బందులు పడుతున్నామని, పట్టించుకునే నాథుడు లేకపోయారని కాలనీవాసులు వాపోతు న్నారు. పిల్లా పాపలతో ఊరుకాని ఊరొచ్చి కనీస సదుపాయాలు లేక పడరాని పాట్లు పడుతున్నా మని కాలనీవాసులు వాపోతున్నారు. ఏ సమస్య వచ్చినా సుదూర ప్రాంతం వెళ్లాల్సి వస్తోందన్నారు. కాలనీలో సరఫరా చేసే నీరు కుళాయి లకు ట్యాప్‌లు లేకపోవడంతో వృథాగా పోతున్నాయని అంటున్నారు.

  • ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నాం: ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ

వెలుగుబంద లేఅవుట్‌లో 9 బోర్లు ఏర్పాటు చేశాం. 5 ట్యాంకులను నిర్మించాం. వీటిలో ప్ర స్తుతం 2 ట్యాంకుల నుంచి నీరు సరఫరా అవు తోంది. అక్కడక్కడ ఇల్లు నిర్మించుకున్న వారికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో తాగునీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో ప్రతి ప్లాటుకు కుళాయిలు ఏర్పాటు చేశారు. అయితే పూర్తి స్థాయిలో నివాసాలు ఏర్పాటు చేసుకోకపోవ డంతో కొంతమంది ఆకతాయిలు ట్యాప్‌లను తొలగించడంతో తాగునీరు వృథాగా పోతోంది. నగరపాలక సంస్థ ట్యాంకర్లను ఇచ్చింది. లేఅవుట్లో ఉన్న బోర్లు ద్వారా నీటిని ట్యాంకర్లలో నింపి సరఫరా చేస్తున్నాం. మరో నెల రోజుల్లో లేఅవుట్లో నిర్మించిన 5 ట్యాంకుల్లో నీటిని నింపి పూర్తి స్థాయిలో సరఫరా చేస్తాం..

Updated Date - Jun 10 , 2025 | 01:08 AM