Share News

మద్యం మత్తు... కారు, బైక్‌ చిత్తు!

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:42 AM

ఆలమూరు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల వద్ద జాతీయరహదారిపై ఒక యువకుడు రాంగ్‌ రూట్‌లో బైక్‌ నడుపుతూ మద్యం మత్తులో అతివేగం గా వస్తున్న కారుపైకి దూసుకెళ్లాడు. బైక్‌ నేరుగా ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడం తో కారు ముం

మద్యం మత్తు... కారు, బైక్‌ చిత్తు!
ఆలమూరు మండలం చొప్పెల్ల హైవేపై బైక్‌తో ఢీకొని కారుపైకి ఎక్కిన యువకుడు

కారుపైకి దూసుకెళ్లి కూర్చుండిపోయిన యువకుడు

ఆలమూరు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల వద్ద జాతీయరహదారిపై ఒక యువకుడు రాంగ్‌ రూట్‌లో బైక్‌ నడుపుతూ మద్యం మత్తులో అతివేగం గా వస్తున్న కారుపైకి దూసుకెళ్లాడు. బైక్‌ నేరుగా ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడం తో కారు ముందు భాగం (బానెట్‌, బంపర్‌) తీవ్రంగా దెబ్బతిన్నాయి. బైక్‌ పూర్తిగా ధ్వంసమైంది. బైక్‌ నడుపుతున్న యువకుడు కారు బానెట్‌పై, విండ్‌షీల్ట్‌ పగిలిన చోట కూర్చుండిపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో యువకుడు మద్యం తాగి ఉన్నాడని స్థానికులు తెలిపారు. రోడ్డుపై వాహనాలు రాకపోకలు నిలిచిపోగా స్థానికులు, ప్రయాణికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Oct 06 , 2025 | 12:42 AM