Share News

అవినీటి..ఆవ!

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:44 AM

రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో మురుగు నీటిపారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో రూ.కోట్లు వృఽథా అవుతున్నాయి

అవినీటి..ఆవ!
వ్యర్థాలతో నిండిన ఆవ ఛానల్‌

కాంట్రాక్టర్లు,అఽధికారులు మింగుడే

ఎస్‌టీపీకి ఏడాదికి రూ.50 లక్షలు

అక్కడ శుద్ధి చేసేది తక్కువ..

ఆ నీరు మళ్లీ ఆవ చానల్‌కే

ఆ మురుగు గోదావరిలోకే

అవుట్‌లెట్‌ లేకుండా శుద్ధి?

మరో రెండు ఎస్‌టీపీలు రెడీ

(రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)

రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో మురుగు నీటిపారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో రూ.కోట్లు వృఽథా అవుతున్నాయి. శుద్ధిచేసిన ము రుగునీటికి అవుట్‌లెట్‌ లేకపోవడం రూ.కోట్ల అవినీతికి అవుట్‌లెట్‌గా మారింది. ఎస్‌టీపీ నుం చి ధవళేశ్వరం సాయిబాబా గుడి వరకూ సు మారు 5.5 కిలోమీటర్ల మేర ఈ ఆవ ఛానల్‌ ఉంది.ఎస్‌టీపీ నీటిని దీనిలోకి వదిలేస్తున్నామని చెబుతున్నారు. కానీ చానల్‌ అంతా పూడు పోయింది. పైగా హుకుంపేట, వీఎల్‌ పురం, బాలాజీపేట నుంచి వచ్చే మురుగునీరంతా ఈ చానల్‌ గుండా ధవళేశ్వరం సాయిబాబా గుడి సమీపం నుంచి గోదావరిలో కలుస్తోంది. ఇం దులో శుద్ధిచేసిన నీరు ఉందని చెబుతున్నారు. కానీ ఉపయోగం ఏముంది. చివరకు గోదా వరిలో మురుగునీరే కలుస్తుంది. పైగా ఆవ ప్రాంతమంతా మురుగునీరు పేరుకుపోవడం గమనార్హం. ఈ మురుగునీటి ప్రవాహానికి సరైన అవుట్‌లెట్‌ లేకుండా ఎంత చేసినా అది దోపి డీనే. ప్రజాధనాన్ని వృఽథా చేయడమే.

మురుగంతా చేరేది ఆవకే..

నగరపాలక సంస్థలో 60 మిలియన్‌ లీటర్ల (60 ఎంఎల్‌డీ) మురుగునీరు లభ్యమవుతోంది.చెత్త రోజుకు 160 టన్ను లు వస్తుంది. చెత్త కొంత వరకూ లూ ధర్‌గిరిలోని క్వారీగొయ్యిలో వేస్తున్న సం గతి తెలిసిందే. కోరుకొండ రోడ్డు, లలితా నగర్‌ వాటి ఎగువ ప్రాంతాల నుంచి మురుగంతా నల్లా ఛానల్‌ ద్వారా గోదా వరిలోకి పంప్‌ చేస్తారు. ఇక లాలా చెరువు వైపు నుంచి ఆర్ట్స్‌ కాలేజీ మీదు గా వచ్చే మురుగు కంబాల చెరువులోకి చేరుతోంది. అక్కడ నుంచి ఆవ చానల్‌కు పంప్‌ చేస్తారు. మెయిన్‌ మార్కెట్‌, ఏవీ అప్పారావు రోడ్డు, హుకుంపేట, బాలాజీ పేట తదితర ప్రాంతాల మురుగంతా ఆవచానల్‌కే వస్తుంది. కార్పొరేషన్‌లోని ఎక్కువ మురుగునీటిని షెల్టాన్‌ హో టల్‌ ప్రాంతంలోని ఆవ చానల్లోకి పంప్‌ చేస్తు న్నారు. కొంత సహజంగా చేరుతోంది.

ఎస్‌టీపీలు నిర్మాణం..

ఆవ చానల్‌ నుంచి వచ్చిన నీటిని శుద్ధి చేయడానికి వాంబే గృహాలకు కూత వేటు దూ రంలో గతంలోనే 30 ఎంఎల్‌డీ సీవేజీ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్‌ (ఎస్‌టీపీ) నిర్మించారు. ఇక్కడే 55 ఎంఎల్‌డీ ఎస్‌టీపీ నిర్మాణంలో ఉంది. దాని పక్కనే అమృత పథకం కింద 5 ఎంఎల్‌డీ ఎస్‌టీపీ నిర్మాణంలో ఉంది. ఇవి ఫిబ్రవరికి పూర్తి కావొచ్చని అధికారులు చెబుతున్నారు. కొత్తవి పూర్తయితే మొత్తం 90 ఎంఎల్‌డీ డ్రైనే జీ వాటర్‌ను శుద్ధి చేయవచ్చు. కానీ ఈ నీటిని బయటకు పంపడానికి సరైన అవుట్‌లెట్‌ లేదు. ఆవ ఛానల్‌ నిర్మించి అక్కడ నుంచి ధవళేశ్వ రం దిగువన గోదావరిలో ఈ మురుగు కలిపే ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ ధవళేశ్వరం వద్ద ఓ చిన్న ఎస్‌టీపీని నిర్మించడానికి ఇరిగేషన్‌ అఽధికారులు మోకాలడ్డుతున్నారు.

ఏడాదికి రూ.50 లక్షలు వృథా

ఆవలో ప్రస్తుతం పనిచేస్తున్నట్టు చెబుతున్న 30 ఎంఎల్‌డీ ఎస్‌టీపీ ప్లాంట్‌కు ఏడాదికి రూ. 50 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నారు. ఇదంతా ఓ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టేస్తున్నాయి. వాస్తవా నికి ఇక్కడ శుద్ధి చేసిన నీరు సద్వినియోగ మైతే ఈ ప్లాంట్‌ నిర్వహణకు ఎంత ఖర్చు చేసినా తప్పుండదు. కానీ ఆవ నుంచి వచ్చిన మురుగునీరు రోజుకు 30 మిలియన్‌ లీటర్ల నీటిని ఇక్కడ శుద్ధి చేస్తున్నట్టు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితి అలా లేదు. ఇక్కడ ఆవ చానల్‌ పూర్తిగా పూడుపోయింది. ఇదంతా అవినీతికి అవుట్‌లెట్టే. ఆవ చానల్‌ నీటినంతా శుద్ధి చేస్తు న్నట్టు చెబుతుంటారు. కానీ చిన్న చానల్‌ ద్వారా కొంత నీరు మాత్రమే ఎస్‌ టీపీకి వెళుతుంది. మిగతా నీరంతా ఆవ ఛానల్‌ నుంచే ముందుకు పోతోంది.

మెకానికల్‌ స్ర్కీనింగ్‌ రూ.1.10 కోట్లు

ఎస్‌టీపీకి ముందు ఈచానల్‌ మీద రూ.కోటి 10 లక్షలతో మెకానికల్‌ స్ర్కీనింగ్‌ ఏర్పాటు చేశారు.వైసీపీ హయాంలో ఇదో కాంట్రాక్టర్‌కు అప్పగించారు.ఇది కూడా మరో అవినీతి బాగో తం ఉంది.ఈ స్ర్కీన్‌ ఆవ చానల్‌ నుంచి వచ్చిన చెత్తనే తీసి గట్టుమీద వేస్తుంది. మురుగునీరు ముందుకు పోతుంది. అందులో నుంచి కొంత మురుగునీటిని ఎస్‌టీపీకి ఉపయోగిస్తారు. కానీ రోజుకు కొద్దిగా చెత్తను మాత్రమే తీస్తారు. ఎండిన తర్వాత డంపింగ్‌ చేస్తున్నారు.

ఇంకేం ఉపయోగం?

కార్పొరేషన్‌లో పెద్ద ఎత్తున పారిశుధ్య వ్య వస్థ ఉంది.అయినా ఆవ ఛానల్‌ చెత్తతో నిం డిపో తుంది.వాస్తవానికి కంబాలచెరువులో మురుగు నీటిని తోడడానికి ఓ పంపు హౌస్‌ ఉంది. ఇక్కడ నెలకు రూ.1.5 లక్షల ఖర్చవుతుంది. కేవలం మురుగునీటిని ఎత్తిపోయ డానికే ఇంత ఖర్చవుతోంది. ఏబీ నాగేశ్వరరావు పార్కు సమీపంలో మరో పంపింగ్‌ హౌస్‌ ఉంది. మెకానికల్‌ స్ర్కీన్‌ ఉంది.ఇక్కడ నెలకు రూ.60 వేల వరకూ ఖర్చవుతుంది.ఇంత జరిగినా ఇక్కడి మురుగునీరు ఆవ చానల్‌లోకి వెళ్లేస రికి టన్ను ల కొద్దీ చెత్త పేరుకుపోతుంది.

ఇలా చేస్తే బెటర్‌?

ఆవ ఛానల్‌ క్లియర్‌ చేయాలి. ఆక్రమణలు తొలగించి,వేగంగా మురుగు ప్రవహించేడ్రైన్‌గా రూపొందిస్తే చాలా వరకూ సమస్య తీరుతోం ది. కొత్త ఎస్‌టీపీలు ఫిబ్రవరిలో పూర్తి చేసినా, శుద్ధిచేసిన నీటిని ఎక్కడకు పంపి స్తారు. మొక్కలు,బస్టాండ్‌; రైల్వే స్టేషన్లలో విని యోగానికి (తాగునీటికి కాదు) ఉపయోగిస్తా మనే ప్రతిపాదన ఉంది. అవన్నీ సిద్ధం చేసి ఒక స్పష్టమైన ప్రణాళికతో పనులు చేస్తేనే ఈ ఎస్‌టీపీల ఉపయోగం..లేకపోతే నిర్వహణ పేరిట రూ.కోట్లు దోపిడీయే అవుతుంది.

Updated Date - Oct 14 , 2025 | 12:44 AM