శరన్నవరాత్రి ఉత్సవాలకు ద్రాక్షారామలో రాట ముహూర్తం
ABN , Publish Date - Sep 15 , 2025 | 12:10 AM
ద్రాక్షారామ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఈనెల 22 నుంచి జరగనున్న దేవీశరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లకు ఆది వారం శాస్త్రోక్తంగా రాట ముహూర్తం జరిపారు. ఉదయం ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గాభవానీ, సత్యంవాసంశెట్టి ఫౌండేషన్
ద్రాక్షారామ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఈనెల 22 నుంచి జరగనున్న దేవీశరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లకు ఆది వారం శాస్త్రోక్తంగా రాట ముహూర్తం జరిపారు. ఉదయం ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గాభవానీ, సత్యంవాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, కృష్ణకుమారి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. 10.58 గంటలకు రాట ముహూ ర్తం చేశారు. ఆలయ అర్చకులు, వేదపండిత బృందం కార్యక్రమం జరిపించారు. సర్పంచ్ కొత్తపల్లి అరుణ, నాటక అకా డమీ డైరెక్టరు పెంకే అన్న పూర్ణ, కూటమి నాయకులు పెంకే సాంబశివరావు, సంపత్, ఏడుకొండలు, భక్తులు పాల్గొన్నారు.