ద్రాక్షారామలో అపచారం
ABN , Publish Date - Dec 31 , 2025 | 01:22 AM
ద్రాక్షారామ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ముక్కోటి ఏకాదశి పర్వదినాన పంచారామ క్షేత్రం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామలో అపచారం జరిగింది. భీమేశ్వరస్వామి ఆల యం బయట ఉన్న స్వామివారి కొలను (సప్తగోదావరి రేవు) కపాలేశ్వరఘట్టంలో ఉన్న శివలింగాన్ని (కపాలేశ్వరస్వా
కపాలేశ్వరఘట్టంలో శివలింగం ధ్వంసం
గుర్తుతెలియని దుండగుల దుశ్చర్య
సూర్యాస్తమయంలోపే నూతన శివలింగం ప్రతిష్ఠ
ద్రాక్షారామ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ముక్కోటి ఏకాదశి పర్వదినాన పంచారామ క్షేత్రం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామలో అపచారం జరిగింది. భీమేశ్వరస్వామి ఆల యం బయట ఉన్న స్వామివారి కొలను (సప్తగోదావరి రేవు) కపాలేశ్వరఘట్టంలో ఉన్న శివలింగాన్ని (కపాలేశ్వరస్వామి) గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. మంగళవారం తెల్లవారుజామున పూజలు చేసేందుకు వెళ్లిన భక్తులు శివలింగం ధ్వంసం కావడం గమనించి దేవదాయశాఖ ఆలయ సహాయ కమిషనర్ అల్లు వెం కట దుర్గాభవానీ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆమె కేంద్ర పురావస్తుశాఖ, చీఫ్ కన్సర్వేటర్(సీఏ), ద్రాక్షారామ పోలీసులు, దేవదాయశాఖ కమి షనర్, ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చా రు. సమాచారం తెలిసి న వెంటనే జిల్లా దేవదాయశాఖ అధికారి వి.సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పురావస్తుశాఖ, దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో సూర్యాస్తయంలోపుగా ధ్వంసమైన శివలింగం స్థానంలో శాస్త్రోక్తంగా నూతన శివలింగం ప్రతిష్ఠించారు.
దోషులను పట్టుకుంటాం : ఎస్పీ
సమాచారం తెలిసిన వెంటనే డీఎస్పీ రఘువీర్, సీఐ ఎం.వెంకటనారాయణ, ఎస్‌ఐ ఎం.లక్ష్మణ్ సం ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాం తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తదుపరి జిల్లా ఎస్పీ రాహుల్‌మీనా, ఆర్డీవో దేవరకొండ అఖిల సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్పీ పోలీసు అధికారులను పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌టీమ్ సభ్యులు ఆధా రాలు సేకరించారు. డ్వాగ్‌స్క్వాడ్‌తో తని ఖీ చేశారు. అనంతరం ఎ స్పీ విలేకర్లతో మా ట్లాడుతూ మంగళవారం ఉదయం కొంతమంది భక్తులు శివలింగం ధ్వంసం అయ్యి ఉండడం గుర్తించి సమాచారం ఇచ్చారని, ఘటనకు సంబంధించి సీసీ కెమెరా లు, ఇతర ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నామన్నారు. వీలైనంత త్వరగా దోషులను పట్టుకుంటామన్నారు. అప్పటి వరకు ఎటువంటి వదంతులు ప్రచారం చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. కాగా పురావస్తుశాఖ ఉద్యోగి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేశారు.
భారీగా ప్రజలు..
కాగా శివలింగం ధ్వంసం చేశారన్న సమాచారం తెలియడంతో భారీగా ప్రజలు సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. మంత్రి సుభాష్ తండ్రి, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పిల్లి సూర్యప్రకాష్, బీజేపీ సీనియర్‌నాయకులు కర్రి చిట్టిబాబు, దూడల శంకర నారాయణ, వైస్ ఎంపీపీ శాఖాబాబి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పూర్వాపరాలు తెలుసుకున్నారు. ఈ ఘనటలో దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నూతన శివలింగం ప్రతిష్ఠ
ధ్వంసమైన శివలింగం స్థానంలో నూతన శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. మంగళవారం మధ్యాహ్నానానికి పురావస్తు శాఖ సీఏ కెఎన్.మూర్తి నూ తన శివలింగాన్ని సమకూర్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న దేవదాయశాఖ ఉపకమిషనరు డీవీ.రమేష్‌బాబు పర్యవేక్షణలో ఆలయ వేదపండితులు, స్వస్తివాచకులు, అర్చకులు హోమం, పూజాధికాలు నిర్వహించారు. సూర్యాసమయం లోపే శాస్త్రోక్తంగా నూతన శివలింగం ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో అల్లు భవానీ, దే వదాయశాఖ తనిఖీదారు బాలాజీ రామ్ ప్రసాద్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.