అంబేడ్కర్‌కు అవమానం
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:05 AM
శంఖవరం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా శంఖవరం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. ఆ

శంఖవరంలో రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులు
భగ్గుమన్న దళిత సంఘాలు
రోడ్డుపై బైఠాయింపు
శంఖవరం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా శంఖవరం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. ఆగంతకులు మం గళవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాం తంలో అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వే శారు. ఉదయం 6గంటలకు ఈ సంఘటన వె లుగులోకి రావడంతో స్థానిక కాలనీవాసులు, దళిత సంఘాలు భగ్గుమన్నాయి. అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయించారు. దోషులను శిక్షించేవరకూ ఆందోళన విరమించేదిలేదంటూ భీష్మి ంచారు. అడిషనల్ ఎస్పీ ఎమ్‌జేవీ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో క్లూస్‌టీమ్, డాగ్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించాయి. సీసీటీవీని పుటేజ్‌ని పరిశీలించి నిందితుల కోసం గాలిస్తున్నారు.
24 గంటల్లో పట్టుకుంటాం : ఎస్పీ
ఆందోళనాకారులతో చర్చించిన జిల్లా ఎస్పీ బిందుమాధవ్ నిందితులను పట్టుకునేందుకు 24 గంటల సమయం కోరారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సీసీపుటేజ్, ఇతర సీసీ కెమెరాలను పరిశీలించామని, సెల్ టవర్ ఆధారంగా కూడా వారి ఫోన్లను ట్రేస్ చేస్తున్నామని, నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నామ ని తెలిపారు. ఇప్పటికే దళిత సంఘాల నేత లు, పోలీసులతో కమిటీ వేశామన్నారు. విచారణ వేగవంతం చేస్తామని, నిందితులను పట్టుకునేందుకు సహకరించాలని కోరారు. నిందితులను పట్టుకునేవరకూ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు శంఖవరంలోనే ఉంటారని ఆయన తెలిపారు.
నిందితులను గుర్తిస్తే బహుమతి
అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన నిందితులను గుర్తించినవారికి బహుమతి ఇ స్తామని పోలీసులు ప్రకటించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సీసీ పుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు. తెల్లవారుజాము న 3:30 గంటల సమయంలో బైక్‌పై వెళ్తున్న నిందితుల వీడియో సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసామని పోలీసులు తెలిపారు.
హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లాం : ఎమ్మెల్యే సత్యప్రభ
ప్రత్తిపాడు/శంఖవరం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరంలో అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన ఘటనను హోంమంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తెలిపారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంబేడ్కర్‌ను అవమానించ డం దారుణమని, దీనిపై హోం మంత్రి, జిల్లా ఎస్పీలతో మాట్లాడామన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఈ ఘటనపై ప్రజలు సంయమనం పాటిం చాలని ఎమ్మెల్యే సత్యప్రభ కోరారు.