Share News

14 మంది కార్యదర్శులకు డీపీవో చార్జిమెమోలు

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:27 AM

జిల్లావ్యాప్తంగా 14 పంచా యతీల్లో పరిమితికి మించి అడ్డగోలుగా సిబ్బందిని నియమించుకొని ఇష్టానుసారం జీతాలు చెల్లిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియో గం చేస్తున్నారు.

14 మంది కార్యదర్శులకు  డీపీవో చార్జిమెమోలు
వెంకటనగరం కార్యదర్శికి డీపీవో జారీ చేసిన చార్జిమెమో

రాజమహేంద్రవరం రూరల్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా 14 పంచా యతీల్లో పరిమితికి మించి అడ్డగోలుగా సిబ్బందిని నియమించుకొని ఇష్టానుసారం జీతాలు చెల్లిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియో గం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకా రం పంచాయతీలకు సమకూరే ఆదాయం లో 50 శాతానికి మించి సిబ్బందికి జీత భత్యాలు చెల్లించాలి.ఈ నిబంధన అడ్డం పెట్టుకుని జీతాలు మించి చెల్లిస్తూ ఇష్టాను సారం వ్యవహరిస్తున్నారు. రాజానగరం మండలం మల్లంపూడిలో పంచాయతీకి వచ్చే ఆదాయంలో 53.80 శాతం, పుణ్య క్షేత్రంలో 52.70 శాతం చెల్లిస్తున్నారు. కడి యం మండలం వీరవరంలో అత్యధికంగా 79.30 శాతం జీతాలకే వెచ్చిస్తున్నారు. రాజ మహేంద్రవరం రూరల్‌ మండలం వెంకట నగరం గ్రామంలో 77.18 శాతం జీతాలకు ఖర్చు చేస్తున్నారు.బిక్కవోలు మండలం పం దలపాకలో 64.62 శాతం, రంగాపురంలో 55.36 శాతం చెల్లిస్తున్నారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో 60.06 శా తం,మునికూడలిలో 56.52 శాతం, సీతాన గరంలో 52.49 శాతం చెల్లిస్తున్నారు. రం గంపేట మండలం ముకుందావరం గ్రా మంలో 54.66 శాతం, పి.వీరంపాలెంలో 53.13 శాతం, దొడ్డిగుంటలో 50.02 శాతం, అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామం లో 50.67 శాతం, పెరవలి మండలంలో 50.02 శాతం సిబ్బంది జీత భత్యాలకు ఖర్చు చేశారు. పంచాయతీరాజ్‌ జీవో ఎంఎస్‌ నెంబరు 57 ప్రకారం సమాధానం ఇవ్వాలంటూ డీపీవో శాంతామణి ఆయా పంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ చేశారు. నిర్లక్ష్యంగా వ్వవహరిస్తే చట్టబ ద్ధమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు

Updated Date - Apr 30 , 2025 | 12:27 AM