Share News

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌లో శరవేగంగా పనులు

ABN , Publish Date - May 06 , 2025 | 12:42 AM

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. రాజమహేంద్రవరంలో 9, 10 డివిజన్లలోని గాదాల మ్మనగర్‌, లోలుగు నగర్‌ పార్కు ప్రాంతాల్లో రూ.1.32 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు వారిద్దరూ సోమవారం శంకుస్థాపనలు చేశారు.

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌లో శరవేగంగా పనులు
రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే వాసు, ఎమ్మెల్సీ సోము

  • ఎమ్మెల్యే ఆదిరెడ్డి, ఎమ్మెల్సీ సోము

  • రాజమహేంద్రవరంలో రూ.1.32 కోట్ల వ్యయంతో రోడ్డు పనులకు శంకుస్థాపనలు

రాజమహేంద్రవరం సిటీ, మే 5(ఆంధ్రజ్యోతి): డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. రాజమహేంద్రవరంలో 9, 10 డివిజన్లలోని గాదాల మ్మనగర్‌, లోలుగు నగర్‌ పార్కు ప్రాంతాల్లో రూ.1.32 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు వారిద్దరూ సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో అవసరమైన చోట్ల రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నామన్నా రు. ఐదేళ్ల వైసీపీ పాలనలో నగరంలోని ప్రధాన మార్గాల్లో అవసరం లేకపోయినా డివైడర్లు, పుట్‌పాత్‌లు నిర్మించారని, బీసీలు నివసించే ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల్లో తాము మార్పుచేసి చూపించామన్నారు. 15 ఏళ్ల కలగా ఉన్న గోదావరి బండ్‌ రివర్‌ ఫ్రంట్‌ పనులు ప్రారంభిస్తున్నామని చెప్పడానికి ఆనంద పడుతున్నామన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ భవిష్యత్‌ ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలు ఆదిరెడ్డి వాసు కల్పిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో కూట మి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • వైద్యానికి అధిక ప్రాధాన్యం

స్థానిక లాలాచెరువు సూర్యనమస్కారాల పార్కు వద్ద సోమవారం టీడీపీ నాయకులు రవి యాదవ్‌, అతడి సోదరుడు బీజేపీ నాయకు డు మరుకుర్తి నరేష్‌యాదవ్‌ల ఆధ్వర్యంలో సహృదయ ఫౌండేషన్‌, మదర్‌ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజావైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని, రాజమండ్రిలో ప్రభుత్వాసుపత్రిని మెరుగుపరిచామని, ఎన్టీఆర్‌ వైద్యసేవలు వర్తించని వారికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం చేయిస్తున్నామన్నారు. రవి యాదవ్‌ సోదరుడు దుర్గాయాదవ్‌ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, వైసీపీ యువజన విభాగం నాయకుడు జక్కంపూడి గణేష్‌, కాంగ్రెస్‌ నాయకుడు అంకం గోపి, యర్రా వేణుగోపాలరాయుడు, కాశి నవీన్‌కుమార్‌, నెక్కళ్ళ బాబురావు యాదవ్‌, డాక్టర్‌ రామా ఉషాకిరణ్‌, గండేపూడి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 12:42 AM