Share News

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో అభివృద్ధి

ABN , Publish Date - Jun 18 , 2025 | 01:04 AM

కేంద్రంలో ఎన్డీయే కూటమి, రాష్ట్రంలో ఎన్డీయే కూటమికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని, తద్వారా రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. దీని అర్థమే డ బుల్‌ ఇంజన్‌ సర్కార్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కడియం మండలంలో రూ.4.56 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో కలిసి శ్రీకారం చుట్టారు.

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో అభివృద్ధి
ఎంఆర్‌ పాలెం కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీ పురందేశ్వరి, చిత్రంలో ఎమ్మెల్యే గోరంట్ల

  • ఎంపీ పురందేశ్వరి

  • కడియం, రాజమహేంద్రవరం రూరల్‌లో రూ.11.39 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

కడియం, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో ఎన్డీయే కూటమి, రాష్ట్రంలో ఎన్డీయే కూటమికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని, తద్వారా రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. దీని అర్థమే డ బుల్‌ ఇంజన్‌ సర్కార్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కడియం మండలంలో రూ.4.56 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో కలిసి శ్రీకారం చుట్టారు. మాధవరాయుడుపాలెంలో సర్పంచ్‌ అన్నందేవుల చంటి, దామిరెడ్డిపల్లిలో సర్పంచ్‌ ముద్రగడ సత్యస్వరూప, ఉపసర్పంచ్‌ ముద్రగడ జమీ, వీరవరంలో సర్పంచ్‌ బత్తుల నళినిజయంతిరాము, కడియపులంకలో సర్పంచ్‌-ఇన్‌చార్జి పాటంశె ట్టి రాంజీ అధ్యక్షతన ఈ కార్యక్రమాలు జరిగాయి. కమ్యూనిటీహాళ్లు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకు స్థాపన, సచివాలయం భవనం, రైతు సేవాకేం ద్రానికి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భం గా ఆయా కార్యక్రమాల్లో ఎంపీ పురందేశ్వరి మా ట్లాడారు. గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగక పోగా రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని ఆరోపించారు. కేంద్రం సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి , సంక్షేమం దిశగా ముందుకు తీసుకెళ్లగలుగుతున్నామన్నారు. అమరావతి అభి వృద్ధికి ప్రపంచ బ్యాంక్‌ మాధ్యమంగా కేంద్రం రూ.15వేల కోట్లు, హడ్కో మాధ్యమంగా రూ.11 వేల కోట్లు ఇస్తుందన్నారు. ఎన్నికల తరువాత రూ.12,500 కోట్లు పోలవరం నిర్మాణానికి ఇచ్చిం దన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులను రాష్ట్రం అం దిపుచ్చకోవడం ద్వారా అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కేంద్రం సాయంతో కూటమి ప్రభుత్వం ఓ వైపు సంక్షేమ, మరో వైపు అభివృద్ధి చేస్తుందని ఎమ్మెల్యే గోరం ట్ల అన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్‌, మార్గాని సత్యనారాయణ, వెలుగుబంటి వెంకటాచలం, ప్రత్తిపాటి రామారావుచౌదరి, వెలుగుబంటి నాని, బోడపాటి గోపి, ఆకుల శ్రీధర్‌, మార్ని వాసుదేవరావు, గట్టి సుబ్బారావు, చెల్లుబోయిన శ్రీను, బొర్సు సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

  • రూ.6.83 కోట్ల అభివృద్ధి పనులు

రాజమహేంద్రవరం రూరల్‌, జూన్‌ 17(ఆం ధ్రజ్యోతి): రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలో రూ.6.83 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే గోరంట్ల చేతు ల మీదుగా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయి.శాటిలైట్‌సిటీ డీ-బ్లాక్‌, హుకుంపేట డి-బ్లాక్‌లో కమ్యూనిటీ హాలు రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి, బొమ్మూరులో వివేకానంద చారిటబుల్‌ హాస్పిటల్‌లో నూతన ఆరోగ్య కేంద్రం, మురళీకొండ, మధురానగర్‌లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాల్లో మార్ని వాసు, మత్యేటి ప్రసాద్‌, దుద్దుపూడి రామకృష్ణ, కామిని ప్రసాద్‌, పెండ్యాల రామకృష్ణ, దుద్దుపూడి రమేష్‌, బొప్పన నానాజీ, ఎంఎస్‌ఆర్‌ శ్రీను, దారా అన్నవరం, బీమరశె ట్టి రమేష్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 01:04 AM