ఆపేదెవరు బైరవా!
ABN , Publish Date - Nov 10 , 2025 | 01:57 AM
ఎక్కడపడితే అక్కడ కుక్కలు.. అందుగలవు.. ఇందులేవని సందేహం వలదు.. ఎటు చూసినా కుక్కలే.. ఏ వీధి చూసినా కుక్కల గుంపులే.. ఎంతలా అంటే ఏ వీధిలో అడుగుపెట్టాలన్నా భయపడేంతగా కుక్కలు పెరిగిపోయాయి.. బడి.. గుడి.. ఆసుపత్రి.. బస్టాండ్.. రైల్వే స్టేషన.. క్రీడాప్రాంగణాలు ఎక్కడ చూసినా అవే.. జనసమ్మర్థ ప్రాంతాల్లో కుక్కలు కనబడ కూడదని సాక్షాత్తూ సుప్రీం కోర్టు ఆదేశించినా తీరులో మార్పేమి లేదు.. అవి యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాయి..
భౌబోయ్.. బతకనివ్వడంలేదు!
ఉమ్మడి జిల్లాలో లక్షకుపైనే గ్రామ సింహాలు
పెరిగిపోతున్న కుక్కల సంతతి
ఆసుపత్రులకు కుక్క కాటు బాధితుల క్యూ
తూతూమంత్రంగా ఏబీసీ ఆపరేషన్లు
సుప్రీం కోర్టు ఆదేశించినా కానరాని కదలిక
ఎక్కడపడితే అక్కడ కుక్కలు.. అందుగలవు.. ఇందులేవని సందేహం వలదు.. ఎటు చూసినా కుక్కలే.. ఏ వీధి చూసినా కుక్కల గుంపులే.. ఎంతలా అంటే ఏ వీధిలో అడుగుపెట్టాలన్నా భయపడేంతగా కుక్కలు పెరిగిపోయాయి.. బడి.. గుడి.. ఆసుపత్రి.. బస్టాండ్.. రైల్వే స్టేషన.. క్రీడాప్రాంగణాలు ఎక్కడ చూసినా అవే.. జనసమ్మర్థ ప్రాంతాల్లో కుక్కలు కనబడ కూడదని సాక్షాత్తూ సుప్రీం కోర్టు ఆదేశించినా తీరులో మార్పేమి లేదు.. అవి యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాయి.. అధికారులు చూస్తూనే ఉన్నారు.. కుక్కలు తరుముతుంటే జనం బౌబోయ్ అంటూ పరుగులు పెడుతున్నారు.. ఇకనైనా అధికారులు దృష్టిపెట్టి కుక్కల నివారణ చర్యలు చేపట్టాల్సిందే మరి..
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
పట్టణం,గ్రామం అనే తేడా లేకుండా రాత్రి వేళ అధికా రులను ఏ వీధిలోకి పంపించినా కుక్కలకు బంధీ లవు తారు. వీధుల్లో ఎక్కడ చూసినా వీధి కుక్కలు జనం పిక్కలు లాగేయ డానికి సిద్ధంగా ఉంటున్నాయి. అవి దయతలిస్తేనే రోడ్డుపై జనం సంచరించే పరిస్థితు లు ఉన్నాయంటే అబద్ధం కాదు. కుక్క కరవకుండా ఇంటికి చేరుకున్నామంటే అదృష్టంగానే భావించాల్సి వస్తోంది. ఎక్కడ చూసినా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.పిల్లలను బయటకు పంపడానికి తల్లిదం డ్రులు బెంబేలెత్తిపోతున్నారు.రాజమండ్రి రైల్వేస్టేషనల్లో కుక్కల ను తప్పించుకొని వెళ్లే కంగారులో ప్రమాదాలు జరుగు తున్నా యి.పిల్లల చేతిలో ఏమైనా తిను బండారాలు ఉంటే వాటిపైకి ఇసురుగా వచ్చి లాక్కోవడంతో పాటు పిల్లలపై దాడి చేయడా నికి యత్నిస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం కన్నెర్ర చేసే వరకూ పరిస్థితి వెళ్లింది.ఇప్పటికైనా భౌబోయ్ భయం తగ్గుతుందేమో అని జనం చర్చించుకుంటున్నారు.
సుప్రీం ఆదేశాలు అమలయ్యేనా?
వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఏబీసీ తర్వాత మళ్లీ అదే ప్రాంతంలో వదలొద్దని ఆదేశించింది. కానీ ఈ రెండిటిపై కార్యాచరణ ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటి వరకూ జిల్లాలో కుక్కల షెల్టర్లు లేవు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఏబీసీ తర్వాత ఎక్కడ వదిలి పెట్టాలనే అంశం కూడా కీలకం కానుంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా ప్రాంగణాలు, ఆస్పత్రులు, విద్యా సంస్థలు, జన సమ్మర్ద ప్రాం తాల్లో వీధి కుక్కల జాడ ఉండడానికి వీల్లేదని సుప్రీం చెప్పింది. విద్యా సంస్థల వద్ద కుక్కలు రాకుండా ఏర్పాట్లు ఉన్నా.. మిగతా చోట్ల నియం త్రించడంపై చిత్తశుద్ధి అవసరంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించడం చాలా కష్టమనే ప్రచారం సాగుతోంది. వీధికుక్కలను పట్టుకుని ఒక చోట చేర్చడం ఓ పెద్ద ప్రహసనమే అంటున్నారు. అన్ని కుక్కల ఆలనాపాలనా చూ డాలంటే తలకుమించిన భారమవుతోందని చెబుతు న్నారు.ఈ క్రమంలో సుప్రీం ఆదేశాలపై అధికారులు కార్యాచరణ రూపొందించాల్సి ఉంది.
వెటర్నరీ చతికిల
జిల్లా వ్యాప్తంగా వెటర్నరీ ఉన్న ఆస్పత్రుల్లో సర్జరీలకు పరిక రాలు అందుబాటులో ఉంటా యి. వెటర్నరీ డిస్పెన్సరీలు ఉంటాయి. ఎక్కడా వెటర్నరీ శాఖ ఏబీసీపై దృష్టి సారించడం లేదు.దీంతో పంచా యతీల్లో కుక్కల సంతతి విప రీతంగా వృద్ధి చెందుతోంది. గతంలో కలెక్టర్ ఆదేశాలతో రాజమహేంద్రవరం వెటర్నరీ ఆస్పత్రిలో ప్రతి ఆదివారం వీధి కుక్కలకు ఏబీసీ చేసేవారు. నిలిపివేశారు ఎందుకో మరి..
ఏబీసీ పని చేస్తోందా!
కుక్కల సంఖ్య నియంత్రణకు యాంటీ బర్త్ కం ట్రోల్ (ఏబీసీ) శస్త్రచికిత్సలు చేస్తుంటారు. రాజ మహేంద్రవరం కార్పొరేషన పరిధిలో రోజుకు ప్రస్తుతం 25 వరకూ ఏబీసీ చేస్తున్నామని చెబుతున్నారు.ఒక్కో కుక్కకు రూ.1500 చొప్పున కార్పొరేషన ఖర్చుచేస్తోంది. కుక్కలకు ఏబీసీ ఆపరేషన్లు రాజమహేంద్రవరం కార్పొ రేషనకే పరిమితమైంది. దీని పైనా పర్యవేక్షణ లేదు..ఏ రోజు ఏం చేశారనే నిఘా లేదు. కొవ్వూరు, నిడదవోలు మునిసిపాలిటీల్లో పట్టిం చుకోవడం లేదు. పంచాయతీల్లో ఏబీసీ చేయ డానికి నిధు ల కేటాయింపు లేదు.ఏబీసీ ఆప రేషన చేసినా కొన్నింటికి ఫెయిలవుతున్నాయనే వాదన ఉంది. కాకి నాడ,కోనసీమలో ప్రైవేటుగా చేయిస్తు న్నట్టు సమాచారం.
పెంచేసిన..కరోనా
కరోనా విపత్తు 2019, 2020,2021, 2022లో ఏబీ సీ ఆపేయడంతో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిందని చెబుతున్నారు.2023, 2024లో ఆ సంఖ్యను అదుపులోకి తీసుకురావడానికి సీరియస్‌గా యాక్షనలోకి దిగలేదు. పంచా యతీల్లో ఏబీసీలు లేకపో వడంతో ఆయా ప్రాంతాల్లోని కుక్కలను తీసుకొచ్చి నగర శివార్లలో వదిలేస్తున్నారు. కుక్క లకు డిసెంబరు, జనవరి నెలల్లో బ్రీడింగ్ సమయం. ఒక్కో కుక్కకు ఒక ఈతలో 4 నుంచి 8 పిల్లలు పుడుతుంటాయి.
‘తూర్పు’న 50 వేలు..
తూర్పుగోదావరి జిల్లాల్లో సుమా రు 50 వేల గ్రామ సింహాలు ఉన్నట్టు అంచనా.రాజమహేంద్రవరం సిటీ పరిధిలోనే తక్కువలో తక్కువంటే 15 వేలు ఉంటాయి. శంభూనగర్‌లోనే కుక్కల సంఖ్య అధికం. అధికారులు మాత్రం బాగా తక్కువ చేసి చూపే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రోజుకు కుక్కల నోటికి 100 మంది వరకూ చిక్కుతున్నారు. రాజమహేంద్రవరం సమగ్ర ప్రభుత్వ ఆస్పత్రికి రోజూ సుమారు 50 మంది కుక్క కాటు బాధి తులు వస్తున్నారు.చికిత్స పొందుతున్న వాళ్లు మరో 50 మంది ఉంటున్నారు. ఈ లెక్కన రోజుకు 100కి పైగానే జనం కుక్కల బారిన పడుతున్నారు.
కాకినాడలో 37 వేలు
కాకినాడ జిల్లాలో 37 వేలు శునకాలు ఉన్నట్టు అంచనా. వాటిలో 15 వేలు కాకినాడ కార్పొరేషనలోనే ఉన్నాయి.జిల్లాలో 2021లో కుక్క కాటు కేసులు 6031 నమోదు కాగా రేబిస్‌తో ఏడుగురు మృతిచెందారు. 2022లో 6364 కేసులు నమోదైతే ఆరుగురు మృతిచెం దారు. 2023లో 4293 కేసులు నమోదైతే ఇద్దరు రేబిస్‌తో మృతి చెం దారు.2024లో 5 వేల మంది, 2025లో 4 వేల మంది కుక్కకాటు బారి న పడ్డారు.కాకినాడ అధికారులు ఏబీసీ ఆపరేషన్లు ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా చేయిస్తున్నా సత్ఫలితాలనివ్వడంలేదనే ఆరోపణున్నాయి.
‘కోనసీమ’లో 30 వేలు
కోనసీమ జి ల్లాలో పెంపుడు,వీఽదికుక్కలు 30 వేలు ఉంటాయని చెబుతున్నారు. ఒ క్క అమలాపురంలోనే 5 వేలుపైనే వీధి కుక్కలు ఉంటా యని సమాచారం..జిల్లాలోని పీహె చసీల్లో రోజుకు 40 మంది వరకు కుక్క కాటు బాధితులు వైద్యం చేయించుకుంటున్నారు. జిల్లాలో 4 వేల కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. అమలాపురంలో కుక్కలను పట్టుకునేందుకు కాంట్రాక్టర్‌ను నియమించినట్టు కమిషనర్ నిర్మల్‌కుమార్ తెలిపారు.