పిఠాపురంలో పిచ్చికుక్క సైర్వవిహారం
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:51 AM
పిఠాపురం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం రాత్రి పిచ్చికుక్క సైర్వవిహారం చేసింది. పదిమందికి పైగా గాయాలయ్యాయి. పట్టణంలోని సాలిపేట, తారకరామనగర్ ప్రాంతాల్లో రోడ్డుపై నడిచి వెళ్తున్న, ఇళ్ల వద్ద బయట ఉన్న వారిని విచక్షణారహితంగా కరిచింది. దారిపొడవునా
పది మందికి తీవ్రగాయాలు
భయాందోళనకు గురైన ప్రజలు
పిఠాపురం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం రాత్రి పిచ్చికుక్క సైర్వవిహారం చేసింది. పదిమందికి పైగా గాయాలయ్యాయి. పట్టణంలోని సాలిపేట, తారకరామనగర్ ప్రాంతాల్లో రోడ్డుపై నడిచి వెళ్తున్న, ఇళ్ల వద్ద బయట ఉన్న వారిని విచక్షణారహితంగా కరిచింది. దారిపొడవునా ఎవరిని వదలకుండా దాడి చేయడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పది మందికి పైగా తీవ్ర గాయాలు కాగా వారంతా ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమి త్తం వెళ్లారు. కొందరికి లోతుగా గాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందించారు. తారకరామనగర్‌కు చెందిన బూరాడ లక్ష్మి, మార్కెట్ వీధికి చెందిన ముత్తుర్తి శివ, సాలిపేటకు చెందిన కాకి కుక్కేటేశ్వరరావు, మేకా వారి వీధికి చెందిన కోట వీర్రాజు, విరవాడ గ్రామానికి చెందిన బొజ్జా వీర వెంకట సత్యనారాయణ, గొల్లప్రోలు పట్టణానికి చెందిన పప్పు వరప్రసాద్ సహా పలువురు గాయాలబారిన పడా ్డరు. ఈ ప్రాంతంలో కుక్కల బెడద అధికంగా ఉందని నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.