రాజమహేంద్రవరంలో వేగపరిమితి పెట్టండి
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:22 AM
జాతీయ రహదారిపై లైటింగ్ ఏర్పాటుకు మూడు నెలలు అవసరమా..వాటికి టెండర్లు పిలవాలా? అత్యవసర పను లకు ప్రత్యా మ్నాయ మార్గా లు అన్వేషించుకోలేరా? అం టూ కలెక్టర్ అధికారులపై మ ండిపడ్డారు.
ఆందోళనకరంగా ప్రమాదాలు
టోల్ ఏజెన్సీలపై దృష్టి పెట్టండి
డీఎల్‌ఆర్‌ఎస్‌సీ సమీక్షలో కలెక్టర్
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 29 (ఆంధ్ర జ్యోతి) : జాతీయ రహదారిపై లైటింగ్ ఏర్పాటుకు మూడు నెలలు అవసరమా..వాటికి టెండర్లు పిలవాలా? అత్యవసర పను లకు ప్రత్యా మ్నాయ మార్గా లు అన్వేషించుకోలేరా? అం టూ కలెక్టర్ అధికారులపై మ ండిపడ్డారు.కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జిల్లా స్థాయి రహదారి భద్రత సంఘం (డీఎల్‌ఆర్‌ఎస్‌సి) సమావేశంలో ఎస్పీ డి.నరసింహకిశోర్‌తో కలిసి పలు సూచనలు చేశారు. జాతీయ రహదా రులపై ప్రమాదాలు అఽధికంగా జరుగుతున్నా యి..మరణాలు ఎక్కువయ్యాయన్నారు. అధికా రులు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రమాదాల తీవ్రతను ఉన్నతాధికారులకు తెలి యజేయడంతో పాటు ఇప్పటి వరకూ తీసుకున్న చర్యల నివేదిక (ఏటీఆర్) ఇవ్వాల న్నారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున ఐరాడ్ యాప్‌పై సంబంధిత శాఖల అధికారులు అవగాహన పెంచుకోవాలని చెప్పారు. రాష్ట్ర రహదారుల టోల్ ధరలు జాతీయ రహదా రు ల టోల్‌తో సమానంగా ఉన్నాయని, కానీ భద్ర తా ప్రమాణాలు ఆ స్థాయిలో లేవన్నారు. రహ దారి అభివృద్ధి సంస్థ అధికారులు విస్తృ తంగా తనిఖీలు చేయాలని,ఆదాయం మాత్రమే లక్ష్యంగా పనిచేస్తున్న ఏజెన్సీలు సరైన ప్రమా ణాలు పాటించకపోతే నోటీసులివ్వాలని ఆదేశిం చారు. అవసరమైతే కాంట్రా క్టర్లకు జరిమానా విధించాలన్నారు. రహదారి భద్రతా చర్యలు బాగా పెంచాలన్నారు. నగరంలో వేగపరి మితి పెట్టాలని,డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేయా లని,శిరస్ర్తాణం(హెల్మెట్) లేని వారికి జరిమా నాలు విఽధించాలని ఆదేశించారు.ఎస్పీ డి.నరసింహ కిశోర్ మాట్లాడుతూ మూ డు నెలలో ప్రమాదాలు, మరణాలు రెట్టింపు ఆయ్యాయన్నారు. గామన్ బ్రిడ్జి నుంచి జీరో పాయింట్ వరకూ ప్రమాదాలు ఎక్కువ గా జరుగుతున్నాయన్నారు. జాతీయ రహదారిపై లైటింగ్ సమస్య ఉందని, రహదారుల పనులు చేపట్టినపుడు పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రవాణా, పోలీసు, ఇత ర సమన్వయ శాఖల అధికారులతో మల్టీ డిసిప్లినరీ బృందాలు ఏర్పడి సంయుక్తంగా తని ఖీలు చేయాలన్నారు. నగరం పరిధిలో హెల్మెట్ ధరించనవసరం లేదనే అపోహ ఉందని.. ఎక్కడైనా ఎవరైనా సరే హెల్మెట్ ధరించాల్సిం దేనన్నారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ బి.వి.రెడ్డి, పలు శాఖల అధికారులు, ఎన్‌హెచ్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.