తూర్పోదయం!
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:48 AM
తూర్పుగోదావరి అతి పెద్ద జిల్లాగా ఆవిర్భవించనుంది.. జిల్లాకు కొత్త స్వరూపం రానుంది.. సరిహద్దులు మార నున్నాయి.
మారనున్న జిల్లా స్వరూపం
మండపేట నియోజకవర్గం విలీనం
రంపచోడవరం విలీనమా.. ప్రత్యేక అథార్టీనా
ఆ రెండూ విలీనమైతేనే 9 నియోజకవర్గాలు
10న కేబినెట్‌లో నిర్ణయం
డిసెంబర్ 31కి ముందే ప్రక్రియ పూర్తి
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
తూర్పుగోదావరి అతి పెద్ద జిల్లాగా ఆవిర్భవించనుంది.. జిల్లాకు కొత్త స్వరూపం రానుంది.. సరిహద్దులు మార నున్నాయి. రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే పశ్చిమలో ఉన్న మూడు నియోజక వర్గాలు విలీనం అయ్యాయి.మరో రెండు నియోజకవర్గాలు తూర్పున విలీనమయ్యే అవ కాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తూర్పున నియోజ కవర్గాల సంఖ్య 9కి చేరనుంది. మంత్రుల కమిటీ సూచనలు అమలైతే అతి పెద్ద జిల్లాగానూ ఆవిర్భవించనుంది. తూర్పుగోదావరి జిల్లాలో మండపేట నియోజకవ ర్గం, ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గం కలిసే అవకాశాలపై మంత్రుల కమిటీ చర్చించిన సం గతి తెలిసిందే. ఈనెల 10వ తేదీన అమరావతిలో జరిగే మంత్రివర్గ సమావేశంలో వీటిపై పూర్తి స్పష్టత రానుం ది. మొత్తం ప్రక్రియ ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ లోపు పూర్తి కావాల్సి ఉంది. 2026 జనవరిలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ఆరంభం కానుంది. ఈలోపే జిల్లాల పునర్విభజన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ నేప ఽథ్యంలో 10వ తేదీన కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్న తర్వాత జిల్లాల పునర్విభజన ప్రకటన వెలు వడే అవకాశముంది. దాని తర్వాతే గెజిట్ జారీ చేస్తారు.
2022లో పునర్విభజన
2022లో జిల్లాల పునర్విభజన జరిగిన సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం హడావుడిగా పార్లమెంట్ పరిధిని జిల్లాగా నిర్ణయిస్తూ జిల్లాల పునర్విభజన చేసేసింది. అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను మూడు ముక్కలు చేసి తూర్పుగోదావరి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ జిల్లాలుగా విభజించింది. కొత్త తూర్పుగోదావరి జిల్లాగా రాజమండ్రి, కొవ్వూరు డివిజన్లను కలిపి ఏర్పాటు చేసింది. నాడు మం డపేట నియోజకవర్గాన్ని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కలపడాన్ని అక్కడ ప్రజలు, ప్రజాప్రతినిధులు వ్యతిరేకించా రు. ఎందుకంటే బొమ్మూరులో ఉన్న జిల్లా కలెక్టరేట్ కొద్ది దూరంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం కూట మి ప్రభుత్వం ఆలోచించి మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపడానికి నిర్ణయించింది. దీం తో మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు మూడు తూర్పుగోదావరి జిల్లాలో కలవనున్నాయి. మం డపేట, రంపచోడవరం నియోజకవర్గాలు విలీనమైతే 9 నియోజకవర్గాలతో తూర్పుగోదావరి పెద్ద జిల్లా కానుంది. మండపేట నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తు న్నారు. రంపచోడవరం విషయంలో 10న క్లారిటీ రానుంది.
రంపచోడవరం ఇలా...
ఏజెన్సీ పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండేది.2022లో జిల్లాల పునర్విభజన తర్వాత అల్లూరి సీతారామరాజు పేరిట ఏర్పడిన పాడే రు జిల్లాలోని రంపచోడవరం నియోజక వర్గంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాన్ని కలిపారు. 200 కిలోమీటర్ల దూరంలోని పాడేరు కలెక్ట రేట్ పరిధిలోకి తేవడంతో చాలామంది ఇబ్బం దులు పడుతున్నారు. ఈ నేపఽథ్యంలో రంపచో డవరం, చింతూరు డివిజన్లతోపాటు పోలవ రం ముంపు ప్రాంతాలను కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కొందరు లేదా, తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలని కొందరు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రుల ఉప కమిటీ ఇక్కడి పరిస్థి తులపై సమీక్షించింది. పోలవరం ముంపు మండలాలు, ఏజెన్సీని ప్రత్యేక అథార్టీగా ఏర్పా టు చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన చేశా రు. రంపచోడవరం నియోజకవర్గాన్ని తూర్పు లో విలీనం చేసే అంశంపైనా చర్చించారు. ఏలూరు జిల్లాలో ఉన్న పోలవరం ప్రాజె క్టుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మండలాల మాటేమిటి..
2022లో జిల్లాల పునర్విభజన లోక్‌సభ స్థానం యూనిట్‌గా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినా చాలాచోట్ల ఈ నిబంధన ఉల్లం ఘించింది. దీంతో కొన్ని మండలాల పరిధిలో సమస్యలు నెలకొన్నాయి. గోపాలపురం నియోజ కవర్గం పరిఽధిలో గోపాలపురం, దేవరపల్లి, నల్ల జర్ల మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో.. చిన వెంకన్న ఆలయం ఉన్న ద్వారకా తిరుమల ఏలూరు జిల్లాలో కలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పరిధిలోని గోకవరం మండలాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలిపా రు. అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడిని కాకినాడ జిల్లాలో కలిపారు. ఆయా మండలా ల ప్రజల సమస్యలు పెరిగాయి.. ఎమ్మెల్యేలు, ఎంపీ వంటి ప్రజాప్రతినిధులు తూర్పు గోదా వరి జిల్లాకు చెందిన వారు.. కలెక్టర్, ఆర్డీవో, ఇతర అధికారులు వేరే జిల్లాలకు చెందిన వారు. తూర్పు కలెక్టరేట్‌తో వీరి సం బంధాలు లేకుండాపోయాయి.వీటిపై ప్రస్తుత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
కోనసీమ వద్దు.. కాకినాడ ముద్దు
రామచంద్రపురం(ద్రాక్షారామ), నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : రామచంద్రపురంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని అఖిలపక్ష జేఏసీ డిమాండ్‌కు మద్దతుగా చాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం బంద్ పాటించారు. వర్తక వాణిజ్య, విద్యా సంస్థలు, బార్ అసోసియేషన్ స్వచ్ఛందంగా బంద్ పాటించారు. రాజగోపాల్ సెంటర్ నుంచి జీవిత బీమా కార్యాలయం వరకు ప్రదర్శన చేశారు. కోనసీమ వద్దు, కాకినాడ ముద్దు అంటూ నినాదాలు చేశారు. 52 పంచాయతీలు, పురపాలక సంఘం రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలపాలని తీర్మానించాయని జేఏసీ నాయకులు అన్నారు. జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కో కన్వీనర్ బి.సిద్దు, చాంబర్ నాయకులు పసుపులేటి సత్తిబాబు, బార్ అధ్యక్షుడు వుండవిల్లి గోపాలరావు, గాదంశెట్టి శ్రీధర్, గొల్లపల్లి కృష్ణ, కౌన్సిలరు అంకం శ్రీను, టీడీపీ నాయకులు నారపురెడ్డి బలరామ్ తదితరులు పాల్గొన్నారు.