discusion with youth
ABN , Publish Date - Sep 10 , 2025 | 02:07 AM
కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ కొద్దిపాటి ఉద్రిక్తతకు దారితీసింది.
కొవ్వూరు, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ కొద్దిపాటి ఉద్రిక్తతకు దారితీసింది. అయితే యువకుల మధ్య జరిగిన ఈ ఘర్షణను కూటమి పార్టీల వివాదం గా ఆపాదిస్తూ కొందరు ప్రచారానికి తెరదీశారు. కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సోమవారం రాత్రి టీడీపీ, జనసేన నాయకులు పార్టీ విషయాలపై చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంలో పట్టణానికి చెందిన ఎం.శివకుమా ర్, బి.అనిల్ మద్యం సేవించి వచ్చారు. నాయకులు మాట్లాడుకుంటుండగా అక్కడకు వచ్చిన శివకుమార్ టీడీపీ, జనసేన గొడవలు మనకెందుకు అంటూ జోక్యం చేసుకోవడంతో అక్కడే కూర్చున్న జనసేన నాయకుడు, ఏఎంసీ డైరెక్టర్ గంగుమళ్ల స్వామి ఒక్కసారిగా పైకిలేచి శివకుమార్‌పై జనసేనని తిడతావా అంటూ చేయి చేసుకున్నాడు. దీంతో అక్కడున్న టీడీపీ కార్య కర్త, అతని అనుచరులు మా అన్నయ్యపై చేయి చేసుకుంటావా అంటూ ఒకరికొకరు కలబడ్డారు. అక్కడే ఉన్న టీడీపీ, జనసేన నాయకులు ఇరు వర్గాలను వారించారు. సమాచారం తెలుసుకు న్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను పంపించివేశారు. పార్టీ కార్యాల యం నుంచి స్వామిని ఇంటి వద్ద కారు దింపుతామంటే వినకుండా నడిచి దొమ్మేరు బయలుదేరాడు. కొవ్వూరు బస్టాండ్ సెంటర్‌లో యువకులు మళ్లీ స్వామిని అడ్డగించడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. స్వామిని పోలీసు వాహనంలో దొమ్మేరు తరలించారు. అనంతరం దొమ్మేరు గ్రామంలో స్వామి ఇంటి వద్ద టెంటువేసుకుని జనసేన నాయకులతో బైఠాయించి న్యా యం చేయాలంటూ నిరసన వ్యక్తంచేశారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని జనసేన నాయకులతో మాట్లాడారు. సమస్యలుం టే పెద్దల సమక్షంలో మాట్లాడి సరిచేస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం జనసేన నాయకులు నిడదవోలులో పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసి జరిగిన సంఘటనను వివరించారు. దీనిపై ఇరుపార్టీల పెద్దల సమక్షంలో కూర్చుని మాట్లాడి సమస్యలను పరిష్కారిస్తామని మంత్రి దుర్గేష్ చెప్పినట్టు సమాచారం. కాగా జనసేన నాయకుడు, ఏఎంసీ డైరెక్టర్ గంగుమళ్ల స్వామి మాట్లాడుతూ ‘‘గత మూ డు రోజుల కిందట దొమ్మేరులో ఎల్‌వోసీ చెక్కు అందించడానికి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, నాయకులు వచ్చారు. ఎమ్మెల్యే గ్రామానికి వచ్చిన తరువాత సమాచారం నాకు అందిం చారు. ఈ విషయం మాట్లాడడానికి సోమవారం రాత్రి స్నేహితుడిని తీసుకుని టీడీపీ పార్టీ కార్యాలయానికి వెళ్లాను. ఇదే విషయమై అక్కడ నాయకులతో మాట్లాడుతుండగా శివ అనే వ్యక్తి వచ్చి దుర్భాషలాడాడు. దీంతో అతని వెనక్కి గెంటాను. దీంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు నాపై దాడిచేశారు. ఈ విషయాన్ని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు తెలియజేశామన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి, అచ్చిబాబుల సమక్షంలో మాట్లాడతానని ఆయ న తెలియజేశారని’’ స్వామి చెప్పారు.
మాట్లాడి సరిచేస్తాం..
కుర్రాళ్ల మధ్య జరిగిన ఘర్షణ ఇది. కొందరు కూటమి పార్టీలకు ఆపాదించడం సరికాదు. ఈ గొడవకు టీడీపీ, జనసేన పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు. ఏదైనా సమస్యలుంటే ఇరుపార్టీల పెద్దల సమక్షంలో మాట్లాడి సరిచేస్తాం.
- ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు