ఎలక్ట్రీషియన్ల రక్షణ, భద్రతకు ప్రాధాన్యం
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:37 AM
పిఠాపురం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ప్రాణాల పణంగా పెట్టి పనిచేసే ఎలక్ట్రీషియన్ల రక్షణ, భద్రతకు ప్రాధాన్యమివ్వాలని ఉప ముఖ్యమం త్రి పవన్‌కల్యాణ్ సూచించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం పిఠాపురం నియోజకవర్గంలోని 325 మంది ప్రవేటు ఎలక్ట్రీ షియన్లకు పని ప్రదేశాల్లో రక్షణ, భద్రత కోసం

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
పిఠాపురం నియోజకవర్గంలో 325మందికి సేఫ్టీకిట్ల అందజేత
పిఠాపురం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ప్రాణాల పణంగా పెట్టి పనిచేసే ఎలక్ట్రీషియన్ల రక్షణ, భద్రతకు ప్రాధాన్యమివ్వాలని ఉప ముఖ్యమం త్రి పవన్‌కల్యాణ్ సూచించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం పిఠాపురం నియోజకవర్గంలోని 325 మంది ప్రవేటు ఎలక్ట్రీ షియన్లకు పని ప్రదేశాల్లో రక్షణ, భద్రత కోసం సేఫ్టీకిట్లను అందజేశారు. ఒక్కొక్కటి రూ.5వేలు విలువ చేసే ఈ సేఫ్టీకిట్‌లో ఎలక్ట్రికల్ పనులకు అవసరమైన టూల్‌కిట్, రబ్బర్ హ్యాండ్ గ్లోవ్స్, షూస్, జాకెట్లు ఉండగా వీటన్నింటిని పవన్ తన సొంత నిధులతో సమకూర్చారు. అనంతరం మాట్లాడుతూ ఏప్రిల్‌లో పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే దళిత యువకుడు పల్లపు సురేష్ ఒకరి ఇంటిలో కరెంటు పనిచేస్తూ మరణి ంచడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. అతడి మరణంతో కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయి నిరాధరమైందన్నారు. సురేష్ మరణం వెనుక ఉన్న కారణాలు పరిశీలిస్తే పేదరికం, విద్యుత్ పనులు చేసేటప్పుడు అతడి వద్ద రక్షణ పరికరాలు లేకపోవడంగా గుర్తించామని తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదనే లక్ష్యంతో తన సొంత నిధులతో ప్రవేటు ఎలక్ట్రీషియన్లందరికీ రక్షణ పరికరాల కిట్లు అందజేస్తున్నామని తెలిపారు. సురేష్ కుటుంబానికి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం ద్వారా రూ.2లక్షలు, చంద్రన్న భీమా ద్వారా రూ.2లక్షలు అందించే ఏర్పాటు చేశామని పవన్ చెప్పారు. నిరుద్యోగ యువత కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి పిఠాపురం నియోజకవర్గంలో జాబ్‌మేళా నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్, పంచాయతీరాజ్ కమిషనరు కృష్ణతేజ, పిఠాపురం కమిషనరు కనకారావు పాల్గొన్నారు.