Share News

రమణయ్యపేట - జె.అన్నవరం రోడ్డుకు తక్షణం మరమ్మతులు చేయాలి

ABN , Publish Date - Sep 17 , 2025 | 12:29 AM

ఏలేశ్వరం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని రమణయ్యపేట నుంచి జె.అన్నవరం వరకు ఉన్న రో డ్డుకు తక్షణం మరమ్మతులు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదే శించారు. ఈ రోడ్డు దుస్థితిపై వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై ఆ

రమణయ్యపేట - జె.అన్నవరం రోడ్డుకు తక్షణం మరమ్మతులు చేయాలి

డిప్యూటీ సీఎం పవన్‌ ఆదేశం

ఏలేశ్వరం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని రమణయ్యపేట నుంచి జె.అన్నవరం వరకు ఉన్న రో డ్డుకు తక్షణం మరమ్మతులు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదే శించారు. ఈ రోడ్డు దుస్థితిపై వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై ఆయన స్పంది ంచి ఆదేశాలు ఇచ్చారు. వెంటనే రహదారిపై ఉన్న గుంతలను పూడ్చాలని కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు. నేషనల్‌ డవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ధనంతో ఈ రహదారిని త్వరలో పున:నిర్మిస్తారన్నారు. పంచాయతీరాజ్‌, ఇంజనీరింగ్‌ ఆర్‌అండ్‌బీ అధికారులు రహదారి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రయాణికులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చేయాలని పవన్‌ సూచించారు. గుంతలు లేని రహదారులు ఉం డాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం సామాజిక మాధ్యమంలో వివరించారు.

Updated Date - Sep 17 , 2025 | 12:29 AM