Share News

ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:34 AM

పిఠాపురం, నవంబరు 3 (ఆంధ్ర జ్యోతి): పవిత్రమైన కార్తీక మాసంలో ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు. క్యూలైన్ల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ, భద్రతాపరమైన అంశాలపై శ్రద్ధ వహించాలన్నారు. కాకినాడ జిల్లాలోని ప్రము ఖ శైవక్షేత్రాలైన పిఠాపురం పాదగయ, సా

ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

అన్నవరం, పిఠాపురం, సామర్లకోట ఆలయాల్లో ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణ

అధికారులు సమన్వయంతో పనిచేయాలి : డిప్యూటీ సీఎం పవన్‌ ఆదేశం

పిఠాపురం, నవంబరు 3 (ఆంధ్ర జ్యోతి): పవిత్రమైన కార్తీక మాసంలో ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు. క్యూలైన్ల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ, భద్రతాపరమైన అంశాలపై శ్రద్ధ వహించాలన్నారు. కాకినాడ జిల్లాలోని ప్రము ఖ శైవక్షేత్రాలైన పిఠాపురం పాదగయ, సామర్లకోట కుమారరామ భీమేశ్వరస్వామి, అన్న వరం సత్యనారాయణస్వామి ఆలయంతో పా టు ఇతర ముఖ్య ఆలయాల్లో ఏర్పాట్లపై ఆయ న సోమవారం కలెక్టర్‌ సగిలి షాన్‌మోహన్‌, ఎస్పీ బిందుమాధవ్‌, జిల్లా అధికారులతో మా ట్లాడి పలు అంశాలపై సూచనలు ఇచ్చారు. కాశీబుగ్గ సంఘటన నేపథ్యంలో ఆలయాల వద్ద అటువంటివి జరగకుండా అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవాదాయ శాఖ ఆధీనంలోని దేవాలయాలతో పాటు ప్రైవేటు ఆలయాల్లో ఉన్న పరిస్థితులపై అధికారులు తక్షణం పరిశీలన జరిపి కలెక్టర్‌, ఎస్పీలకు నివేదిక అందజేయాలని ఆదేశించారు. అన్నిచోట్లా భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుందో పర్యవేక్షణ చేయాలన్నారు. బుధవారం కార్తీ క పౌర్ణమి, ఇతర ముఖ్యమైన పర్వదినాలతో పాటు శని, ఆది, సోమవారాల్లో భక్తుల రద్దీ ఊహించని విధంగా ఉంటుందని తెలిపారు. దేవాదాయ, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖల అధికారు లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల ఏర్పాట్లు ఉండాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. తా త్కాలిక టాయిలెట్లు, మరుగుదొడ్ల ఏర్పాటుతో పాటు చెత్తచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, పారిశుధ్య నిర్వహణపై ఆయా మున్సిపాలిటీలు, పంచాయతీలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. రద్దీ సమయాల్లో ఆర్టీసీ బస్సులను అధికంగా నడపాలని, ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్‌ నియంత్రణపై పోలీసు శాఖ దృ ష్టి సారించాలన్నారు. ఆలయాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రము ఖ క్షేత్రాలతో పాటు అన్ని ఆలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు.

Updated Date - Nov 04 , 2025 | 12:34 AM