అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వాసు శ్రీకారం
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:54 AM
రాజమహేంద్రవరం 48వ డివిజన్ పరిధిలోని సీటీఆర్‌ఐ ఆటోస్టాండ్ నుంచి 5వ నెంబరు బస్టాండ్ వరకు రూ.30 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గురువారం శంకుస్థాపన చేశారు.
రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 11( ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం 48వ డివిజన్ పరిధిలోని సీటీఆర్‌ఐ ఆటోస్టాండ్ నుంచి 5వ నెంబరు బస్టాండ్ వరకు రూ.30 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి నగరంలో మరో రూ.20 కోట్ల అంచనా వ్యయంతో పనులకు టెండర్లు పిలిచామన్నారు. రాజమహేంద్రవరాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి కల్చరల్ క్యాపిటల్‌గా ఉన్న నగరాన్ని టూరిజం హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రూ.8 కోట్లతో రివర్‌ఫ్రంట్ అప్పర్ ప్రామినేడ్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మరో రూ14 కోట్లతో లోయర్ ప్రామినేడ్ పనులను కూడా త్వరలో ప్రారంభించుకుంటామన్నారు. 2027 పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.