అభివృద్ధి, సంక్షేమం టీడీపీతోనే సాధ్యం
ABN , Publish Date - May 21 , 2025 | 12:37 AM
అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని, అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే రాజధాని అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు పనులు వంటి ఎన్నో పనులకు నిధులు మంజూరు చేయించి ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు
ముమ్మిడివరంలో మినీ మహానాడు
ముమ్మిడివరం, మే 20(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని, అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే రాజధాని అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు పనులు వంటి ఎన్నో పనులకు నిధులు మంజూరు చేయించి ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ముమ్మిడివరం విష్ణాలయం సెంటర్‌లోని డీఎల్‌ఎఫ్ ఫంక్షన్ హాలులో మంగళవారం సాయంత్రం జరిగిన మినీమహానాడు సభకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లు 24గంటలు శ్రమిస్తున్నారన్నారు. నియోజకవర్గ పరిధిలో రూ.30కోట్లతో సీసీ రోడ్డు, డ్రైనేజీలు నిర్మించామని, రూ.3కోట్లతో అధ్వానంగా ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులు చేశామన్నారు. అన్నక్యాంటీన్‌ను తిరిగి ప్రారంభించామన్నారు. రూ.25కోట్లతో 37ప్రదేశాల్లో రక్షిత మంచినీటి ట్యాంకులు, పైపులైన్లు నిర్మాణం, రూ.161కోట్లతో ఏఐఐబీ నిధులతో నగర పంచాయతీలో సమగ్ర మంచినీటి సరఫరా పథకం నిర్మాణం, ఓఎన్జీసీ నష్టపరిహారం కింద చేపల వేట మీద ఆధారపడిన 20వేల మందికి రూ.133కోట్లు పంపిణీ చేశామన్నారు. రూ.3కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్డు మరమ్మతులు, కొత్త రోడ్డు నిర్మాణం. పాత ఇంజరం వద్ద రూ.3కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్డు వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టామన్నారు. కడపలో 27, 28, 29తేదీల్లో జరిగే మహానాడుకు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివరావాలన్నారు. మరో ముఖ్య అతిథి మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ఏర్పాటైన పార్టీ టీడీపీ అని అన్నారు. చంద్రబాబునాయుడు విజన్ ఉన్న నాయకుడని, ఆయనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే 17 తీర్మానాలు ప్రవేశపెట్టారు.
తీర్మానాలు.. చంద్రన్నబీమా పునఃప్రారంభం 2014-19 మధ్య ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లుల చెల్లింపు, జిల్లాలో ఎయిర్‌పోర్టు, మెడికల్ యూనివర్శి ఏర్పాట్లు తదితర 17 తీర్మానాలను ప్రవేశపెట్టారు. వీటిని మహానాడులో నివేదించనున్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. 2024-25 మధ్య మృతిచెందిన టీడీపీ నాయకులకు సంతాపం, ఆపరేషన్ సింధూర్‌లో అమరులైన వీరజవాన్లకు నివాళులర్పించారు. తొలుత సభాస్థలికి ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాలకు చెందిన నాయకులతో ఎమ్మెల్యే ర్యాలీగా తరలివచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, నాగిడి నాగేశ్వరరావు, గుత్తుల సాయి, మోకా ఆనంద్‌సాగర్, గొలకోటి దొరబాబు, చెల్లి అశోక్, తాడి నరసింమారావు, టేకుమూడి లక్ష్మణరావు, దాట్ల పృథ్విరాజ్, మందాల గంగసూర్యనారాయణ, అర్థాని శ్రీనివాసరావు, దొమ్మేటి రమణకుమార్, గొల్లపల్లి ధర్మారావు, వాడ్రేవు వీరబాబు, నడింపల్లి సుబ్బరాజు, రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, పొన్నమండ రామలక్ష్మి, ధూలిపూడి బాబి, ములపర్తి బాలకృష్ణ, ఆకాశం శ్రీను, చిక్కాల అంజిబాబు, దాట్ల బాబు, గొల్లపల్లి గోపి, కడలి నాగు, కట్టా సత్తిబాబు, అడబాల సతీష్‌కుమార్, దివి మహాలక్ష్మి, సాగి సూరిబాబురాజు, రామలింగరాజు, కాకర్లపూడి రాజేష్, యాళ్ల ఉదయ్, పిల్లి నాగరాజు, దండుప్రోలు సత్యం, కురసాల శివ, రెడ్డి సుధీర్, విళ్ల వీరాస్వామినాయుడు, నిమ్మకాయల విస్సు, మిమ్మితి చిరంజీవి, దంగేటి శ్రీను, ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, సరిపెల్ల శ్రీనురాజు, కాశి లాజర్, బొక్కా రుక్మిణి, మెండి కమల, బీర సత్యకుమారి, వాసంశెట్టి అమ్మాజీ, పెదపూడి రుక్మిణి, మోపూరి వెంకటేశ్వరరావు, కుంచనపల్లి నారాయణ పాల్గొన్నారు.