గ్రామాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Jun 09 , 2025 | 01:10 AM
గ్రామా ల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు.

రాయవరం, జూన్ 8(ఆంధ్రజ్యోతి): గ్రామా ల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. ఆదివారం చెల్లూరు గ్రామంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ జరిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిపోయిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే అభివృద్ధి, సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారన్నా రు. గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యేకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగ తం పలికారు. ఈసందర్భంగా గ్రామం లో రూ.70 లక్షలతో దంప కాలనీ, చినవాకలి, పెద్దవాకలి, కృష్ణమ్మ చెరువు, ఎర్రమట్టిపురం, తూర్పుపేట, మసీదుసెంటర్ తదితర ప్రాంతాల్లో నిర్మించనున్న డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఇటీవల అగ్ని ప్రమాదంలో నష్ట పోయిన దేవు కృష్ణారావును ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు చుండ్రు వీర్రాజు, మాజీ సర్పంచ్‌లు నూనె ఏసుబాబు, నూనె శ్రీదేవి, మోరంపూడి రాజ్‌కుమార్, మాజీ వైస్ ఎంపీపీ దేవు వెంకట్రాజు, ఎంపీటీసీ గొల్లపల్లి అనురాధ తదితరులు పాల్గొన్నారు.