Share News

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:59 AM

అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. గురువారం ఆత్రేయపురం మండలం వద్దిపర్రులో అమలాపురం- బొబ్బర్లంక రహదారి నుంచి రజకులపేట ఏటిగట్టు మీదుగా రూ.50లక్షల ఎంపీ నిధులతో నిర్మిస్తున్న తారురోడ్డు, ఎస్‌సీ కాలనీ నుంచి పంచాయతీ వరకు నిర్మించనున్న రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సర్పంచ్‌ జుజ్జవరపు శ్యామల ఆధ్వ ర్యంలో వీటిని నిర్వహించారు. కార్యక్రమంలో క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు ముదునూరి వెంకట్రాజు, కరుటూరి నరసింహారావు, కాయల జగన్నాథం, మాజీ ఎంపీపీ పీఎస్‌ రాజు, హరి బాబు పాల్గొన్నారు. లొల్ల రైతు సేవా కేంద్రం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో తహశీల్ధారు రాజేశ్వరరావు, ఏవో మహేష్‌, సర్పంచ్‌ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 12:59 AM