అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - May 04 , 2025 | 01:02 AM
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. శనివారం కడియంలో రూ.4.18 కోట్ల తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనులు, ప్రారంభో త్సవాలు జరిగాయి.
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి
కడియంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
కడియం, మే 3(ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. శనివారం కడియంలో రూ.4.18 కోట్ల తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనులు, ప్రారంభో త్సవాలు జరిగాయి. రూ.2.45 కోట్లతో నిధులతో నూతనంగా నిర్మించే విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి, సుబ్బారావుపేటలో సుబ్బారావుపేటలో రూ.76.50 లక్షలతో వాటర్‌ట్యాంక్, రూ.24.20 లక్ష లతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రూ.73 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఎన్న డూ లేని విధంగా కోట్లాది రూపాయలతో మండల కేంద్రమైన కడియంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. అత్య ధిక ప్రాధాన్యతగా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో ఏపీ పేపరుమిల్లు సహకారంతో ఏర్పాటు చేసిన పలు రకాల పరికరాలను ప్రారంభించారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో సర్పంచ్ మోసిగంటి సత్యవతి, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, టీడీపీ మండలాధ్యక్షుడు వెలుగుబంటి నాని, అన్నందేవుల చంటి, మార్గాని సత్యనారాయణ, డాక్టర్ గోరంట్ల రవిరామ్‌కిరణ్, చెల్లుబోయిన శ్రీను, ఆకుల శ్రీధర్, బోడపాటి గోపి, పంతం గణపతి తదితరులు పాల్గొన్నారు.
డి-బ్లాక్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
రాజమహేంద్రవరం రూరల్, మే 3(ఆంధ్ర జ్యోతి): తెలుగు జాతి ముద్దుబిడ్డ, మహనీయుడు నందమూరి తారక రామారావు అని ఆయనకు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఉందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. హుకుంపేట పంచాయతీ డి బ్లాక్‌లో సోమేశ్వరరావు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని టీడీపీ హెల్త్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్‌తో ఎమ్మెల్యే గోరంట్లఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ఏకైక నేత ఎన్టీఆర్ అని, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తెచ్చి చరిత్ర సృష్టించారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, టీడీపీ మండలాధ్యక్షుడు మచ్చేటి సత్యప్రసాద్, మజ్జి పద్మావతి, నాయకులు చెల్లుబోయిన శ్రీనివాస్, దుద్దుపూడి రామకృష్ణ, మండ బిందు, దుద్దుపూడి రమేష్, పెండ్యాల రామకృష్ణ పాల్గొన్నారు.