పచ్చదనాన్ని పెంపొందించాలి
ABN , Publish Date - May 18 , 2025 | 12:52 AM
మొక్కలు పెంచి వాటిని వృక్షాలుగా ఎదగనిచ్చి పచ్చదనాన్ని పెంపొందించుకోవాలని, దీనిని ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు పిలుపునిచ్చారు. స్వచాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంలోని 16వ డివిజన్‌లో శనివారం బిట్ ద హీట్ కార్యక్రమం నిర్వహించారు.
జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు
పలుచోట్ల స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాలు
మొక్కలు నాటడం, పరిసరాలను శుభ్రం చేసిన అధికారులు, నాయకులు, సిబ్బంది
రాజమహేంద్రవరం సిటీ, మే 17( ఆంధ్రజ్యోతి): మొక్కలు పెంచి వాటిని వృక్షాలుగా ఎదగనిచ్చి పచ్చదనాన్ని పెంపొందించుకోవాలని, దీనిని ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు పిలుపునిచ్చారు. స్వచాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంలోని 16వ డివిజన్‌లో శనివారం బిట్ ద హీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తొలుత బ్రోచర్ ఆవిష్కరించారు. అనంతరం మునిసిపల్ కమిషనర్ కేతన్‌గార్గ్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నగరంలో పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ మూడో శనివారం బీట్ ద హీట్ క్యాంపెయిన్ నిర్వహించుకున్నట్టు చెప్పారు. వేసవి ఎండల రీత్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కార్యక్రమ ప్రధాన ఉద్ధేశమన్నారు. నగర వ్యాప్తంగా ఇప్పటికే 40 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో పాటు పది పంచాయతీలను కలిపి మొత్తం 6560 రెయిన్ వాటర్ హార్వె స్టింగ్(ఇంకుడు గుంతలు) నిర్మాణాలు చేపట్టామన్నారు. పర్యావరణ పరిరక్షణ కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతిఒక్కరు బాధ్యతగా ఒక్క మొక్కను దత్తత తీసుకుని విరివిరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్‌లో ఉన్న ఖాళీ ప్రదేశంలో చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.25 లక్షలు నిధులు మంజూరైనట్టు కమిషనర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా వడదెబ్బ తగలకుండా ప్రజలందరు జాగ్రత్తలు పాటించాలన్నారు. పశువులు తాగునీటికి ఇబ్బంది పడకుండా మానవత్వంతో ఆలోచించి ఇంటి పరిసరాల్లో వాటి కోసం ప్రత్యేకంగా నీటితొట్టెలను ఏర్పాటుచేయాలన్నారు. ఎమ్మెల్సీ సోము మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటి వాటిని పరిరక్షించుకోవాలన్నారు. అనంతరం స్థానికులతో కలిసి వారంతా మొక్కలు నాటారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, సెక్రటరీ శైలజావల్లి, ఎస్‌ఈ ఎంసీహెచ్ కోటేశ్వరరావు, ఎంహెచ్‌వో డాక్టర్ వినూత్న, యానపు యేసు, వరప్రసాద్ పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా కార్పొరేషన్ కార్యాలయ ప్రాం గణంలో ఏర్పాటు చేస్తున్న ఇంకుడు గుంతలను అధికారులతో కలిసి కమిషనర్ కేతన్ గార్గ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల వృద్ధి చెందుతాయన్నారు. మారుతున్న వా తావరణ పరిస్థితులు దృష్ట్యా నీటి ప్రాధాన్యతను ప్రతిఒక్కరూ గుర్తించాలని, ఎక్కడ వర్షపు నీరు నిల్వ ఉంటుందో అక్కడ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే కార్పొరేషన్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కమిషనర్ ప్రారంభించారు.కార్యక్రమంలో మేనేజరు ఎండీ అబ్దుల్ మాలిక్, ఈఈ మాధవి పాల్గొన్నారు.