నేడు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటన
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:24 AM
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ గురువారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మే రకు ఆయన పర్యటన అధికారికంగా ఖరారైం ది. ముందుగా కాకినాడ కలెక్టరేట్‌లో జరిగే స మావేశంలో పాల్గొంటారు. అనంతరం ఉప్పా డలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
కాకినాడ కలెక్టరేట్‌లో సమావేశం
ఉప్పాడలో బహిరంగ సభ
పిఠాపురం, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ గురువారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మే రకు ఆయన పర్యటన అధికారికంగా ఖరారైం ది. ముందుగా కాకినాడ కలెక్టరేట్‌లో జరిగే స మావేశంలో పాల్గొంటారు. అనంతరం ఉప్పా డలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
గురువారంఉదయం8.15గంటలకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంనుంచి బయలుదేరి గన్నవరం ఎ యిర్‌పోర్టుకు వెళ్తారు. అక్కడినుంచి ఉదయం 9.30 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడినుంచి హెలి కాప్టర్‌లో కాకినాడలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ కు వస్తారు. అక్కడినుంచి ఉదయం 10గంటలకు కాకినాడ కలెక్టరేట్‌కు చేరుకుంటారు. కలెక్టరేట్‌లో ఉదయం 10గంటలనుంచి మధ్యా హ్నం 12గంటల వరకూ మత్స్యకార సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీతో సముద్రంలో కాలుష్యం, నష్టపరిహా రం చెల్లింపు తదితర అంశాలపై నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అనంతరం కాకినాడలోని జీఆర్‌టీ హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకూ అక్కడే ఉంటారు. అక్కడ జనసేన నాయకులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. అనంతరం పోలీసు పెరేడ్‌గ్రౌండ్స్‌కు చే రుకుని హెలికాప్టర్‌లో కొత్తపల్లి మండలం ఉప్పాడ చేరుకుంటారు. మధ్యాహ్నం 3గంటల నుంచి 4.10గంటలవరకూ ఉప్పాడ సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనం తరం అక్కడినుంచి హెలికాప్టర్‌లో 4.45గం టలకు రాజమహేంద్రవరంఎయిర్‌పోర్టుకు చేరు కుని ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లి అ క్కడినుంచి మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్తారు. ఈ పర్యటన మొత్తం మత్స్య కార సంఘాల ప్రతినిధులతో సమావేశమై వా రిసమస్యలు తెలుసుకోవడంతోపాటు వాటిని ఎలా పరిష్కరించాలనే అంశంపై పవన్ దృష్టిసారిస్తారని, ఉప్పాడలో బహిరంగసభ ఏర్పా టుతో మత్స్యకారులకు భరోసా కల్పించేలా ఆయన ప్రసంగిస్తారని భావిస్తున్నారు.
కలెక్టరేట్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు
8 డిప్యూటీ సీఎం పవనకల్యాణ్ పర్యటన నేపథ్యంలో ప్రాంగణంలో బారికేడ్లు ఏర్పాటు
కలెక్టరేట్(కాకినాడ),అక్టోబరు8(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవనకల్యాణ్ కాకినాడ పర్య ట న నేపథ్యంలో భారీగా బలగాలను మోహరిస్తు న్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఉదయం 10 గంటలకు ఆయన జిల్లా కలెక్టర్, మత్స్యకార ప్ర తినిధులు, అధికారులతో సమావేశం కానున్నా రు. ఈనేపథ్యంలో కలెక్టరేట్‌లో భారీగా బారికే డ్లు ఏర్పాట్లుచేశారు. కొంతకాలంగా యు.కొత్తప ల్లి మండలంలోని మత్స్యకారులు సముద్రంలో కాలుష్యం కారణంగా చేపలవేట సాగడంలేదని ఆందోళనలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ముం దు జాగ్రత్తగా కలెక్టరేట్‌వద్ద భారీగా బారికేడ్లు, పోలీసుబలగాలను మోహరిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవనకల్యాణ్ సమావేశానికి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్నంగా తనిఖీచేసి పంపే అవకాశా లు ఉన్నాయి. కలెక్టరేట్ ప్రధాన ద్వారం దగ్గర నుంచి సమావేశం జరిగే వివేకానంద హాలు వ రకు ఒక ప్రత్యేకలైనులో సమావేశానికి హాజర య్యే మత్స్యకార సంఘాల ప్రతినిధులు, అధికా రులను పంపేందుకు ఏర్పాట్లుచేశారు. కలెక్టరే ట్‌కు వెనుకవైపు ఉన్న ద్వారాలను మూసివేసి పోలీసులు పహారా కాయనున్నారు. జిల్లాలో డి ప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్ల బందోబస్తును ఎస్పీ బిందుమాధవ్ ప్రత్యేకంగా సమీక్షించారు. పవన్ పర్యటించే అన్నిప్రాంతాలను బుధవారం ఆయన ప్రత్యేకంగా తనిఖీలు చేశారు.
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
డిప్యూటీ సీఎం పవనకల్యాణ్ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ షాన మోహన బుధవారం పరిశీలించా రు. కాకినాడ కలెక్టరేట్‌లో సమావేశం జరిగే వి వేకానంద హాలుతోపాటు ప్రాంగణంలో ఏర్పా ట్లను తనిఖీచేశారు. పిఠాపురం నియోజకవర్గం లో పవనకల్యాణ్ పర్యటన ఏర్పాట్లు పరిశీలిం చిఅధికారులకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు.
భారీగా పోలీసు బందోబస్తు
పిఠాపురం/కొత్తపల్లి, అక్టోబరు 8(ఆంధ్రజ్యో తి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటనకు భారీ పో లీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నా రు. కొత్తపల్లి మండలం ఉప్పాడలో జరిగే బహిరంగసభలో పవన్‌ప్రసం గిస్తారు. బహిరంగ సభ, పరిసర ప్రాంతాల్లో 550మంది పోలీసులు, అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 12మంది సీఐలు, 30మంది ఎస్‌ఐ లతోపాటు పది రోప్‌పార్టీలు విధుల్లో పాలుపంచుకోనున్నాయి. బందోబస్తు నిమిత్తం నియమితులైనవారికి కొత్తపల్లిలోని ఓ ఫంక్షన హాలులో ఎస్పీ బిందుమాధవ్ బుధవారం పలు సూచన లుచేశారు. ఉప్పాడ బీచరోడ్డులో నాలుగు వైపు లా బారికేడ్లుపెట్టారు. సభ జరిగే ఉప్పాడ బీచ రోడ్డులో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.