ఇక అన్నీ ఇక్కడినుంచే..
ABN , Publish Date - Sep 12 , 2025 | 01:03 AM
జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ కా ర్యకలాపాలు అన్నీ ఇకనుంచి గొల్లప్రోలు మం డలం చేబ్రోలులోని డిప్యూటీ సీఎం పవన్‌కల్యా ణ్ నివాసంనుంచే జరగనున్నాయి. పిఠాపురం లో జనసేన ఇన్‌చార్జి ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఖాళీచేయాలని ఆదేశాలు వచ్చాయి. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై స్పష్టత ఇస్తూ సూచనలు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపారు.
చేబ్రోలు డిప్యూటీ సీఎం నివాసం నుంచే పార్టీ కార్యకలాపాలు
పిఠాపురంలో జనసేన కార్యాలయం ఖాళీ చేయాలని ఆదేశాలు
నియోజకవర్గ పార్టీ కార్యకలాపాలపై పవన్‌కల్యాణ్ స్పష్టత
ఆసక్తికరంగా వరుస పరిణామాలు
(ఆంధ్రజ్యోతి-పిఠాపురం)
జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ కా ర్యకలాపాలు అన్నీ ఇకనుంచి గొల్లప్రోలు మం డలం చేబ్రోలులోని డిప్యూటీ సీఎం పవన్‌కల్యా ణ్ నివాసంనుంచే జరగనున్నాయి. పిఠాపురం లో జనసేన ఇన్‌చార్జి ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఖాళీచేయాలని ఆదేశాలు వచ్చాయి. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై స్పష్టత ఇస్తూ సూచనలు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపారు.
మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గంలోని జనసే న క్రియాశీలక కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తల తో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సమావేశం ని ర్వహించిన నాటినుంచి పిఠాపురం నియోజకవ ర్గం జనసేనలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సమావేశంలో నియోజకవర్గంలో జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలు, సమన్వయం లేకపోవడంపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని అధిగమించేందుకు గ్రామస్థాయిలో అయిదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామానికి ఐదుగురు చొప్పున సభ్యుల ఎంపిక బాధ్యతను కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయశ్రీనివాస్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పిడు గు హరిప్రసాద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మ లబాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావులకు అప్పగించారు. ఇప్పటికే కమిటీల ఎంపిక నిమిత్తం కొత్తపల్లి మండలంలో మూడు రోజులు, గొల్లప్రోలు మండలంలో రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించి సభ్యులను ఎంపిక చేశారు. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలు, పిఠాపురం మండలంలోని 24 గ్రామాలకు సభ్యుల ఎంపిక నిమిత్తం సమావేశాలు నిర్వహించాల్సి ఉంది.
ఇప్పుడు కార్యాలయం వంతు
ఎన్నికల సమయంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలులో బైపాస్‌రోడ్డులోని పార్టీ నాయకుడు ఓదూరి నాగేశ్వరరావుకు చెందిన బహుళ అంత స్తుల భవనాన్ని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తన నివాసంగా ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ నుంచే పార్టీపరంగా అన్ని సమావేశాలు, ఇతర ముఖ్య కార్యక్రమాలను నిర్వహించారు. ఎన్ని కల అనంతరం డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఇక్కడికే వచ్చారు. దీన్ని నివాసంగా, క్యాంపు కార్యాలయంగా, పార్టీ కార్యాలయంగా వినియోగించేవారు. జనవాణి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాసరావు ఇక్కడ ఉండే కార్యక్రమాలు చక్కపెట్టేవారు. ఆరునెలల క్రితం మర్రెడ్డికి, భవన యజమానికి తలెత్తిన వివాదం నేపథ్యంలో మర్రెడ్డి చేబ్రోలులోని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నివాసానికి వెళ్లడం మానివేశారు. కార్యాలయ సిబ్బంది కొందరు అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. అనంతరం పిఠాపురం పట్టణంలోని మంగాయామ్మరావుపేటలో భవనం అద్దెకు తీసుకుని దానికే జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంగా బోర్డు ఏర్పాటుచేసి అక్కడినుంచే మర్రెడ్డి, ఇతర నాయకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఫైవ్‌మెన్ కమిటీ ఏర్పాటుతో పరిణామాలు మారిన నేపథ్యంలో పిఠాపురంలోని జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని తక్షణం ఖాళీ చేయాలని, చేబ్రోలులోని కార్యాలయం నుంచే పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాకలాపాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఫైవ్‌మెన్ కమిటీకి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఈ అంశం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలకు ఇది సంకేతమని చెబుతున్నారు. కాగా చేబ్రోలులోని పవన్ నివాసం నుంచే నియోజకవర్గ పా ర్టీ కార్యక్రమాలు జరుగుతాయని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాబు తెలిపారు.
అన్ని కమిటీతోనే..
ఫైవ్‌మెన్ కమిటీని పవన్‌కల్యాణ్ నియమించిన నాటినుంచి పార్టీపరంగా, ప్రభుత్వపరంగా అన్ని కార్యక్రమాల్లోను వీరు కీలకపాత్ర పోషిస్తున్నారు. స్మార్ట్ రైసుకార్డుల పంపిణీలో ఎంపీ ఉదయశ్రీనివాస్, సీఎం రిలీఫ్ ఫండ్, ప్రమాదవశాత్తూ మరణించిన జనసైనికులకు రూ.5లక్షల చెక్కుల పంపిణీలోను తుమ్మల బాబు, దొరబాబు, మర్రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంనుంచి వచ్చేషెడ్యూల్‌లోనూ హరిప్రసాద్ మినహా మిగిలిన సభ్యులందరూ పాల్గొంటున్నట్లు సమాచారం ఇస్తున్నారు.