Share News

అభివృద్ధే ధ్యేయం

ABN , Publish Date - Aug 16 , 2025 | 01:54 AM

అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధే ధ్యేయంగా కూ టమి ప్రభుత్వం పాలన సాగుతోందని డిప్యూ టీ సీఎం పవన కళ్యాణ్‌ అన్నారు. గడచిన ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెర వేర్చుతూ ముందుకు సాగుతున్నామని వివరిం చారు. కాకినాడ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో శుక్రవా రం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి.

అభివృద్ధే ధ్యేయం
కాకినాడ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో గౌరవవందనం స్వీకరిస్తున్న పవన్‌కల్యాణ్‌

  • కూటమి ప్రభుత్వంతోనే ప్రజలకు సంక్షేమం

  • హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నాం

  • కాకినాడ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధే ధ్యేయంగా కూ టమి ప్రభుత్వం పాలన సాగుతోందని డిప్యూ టీ సీఎం పవన కళ్యాణ్‌ అన్నారు. గడచిన ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెర వేర్చుతూ ముందుకు సాగుతున్నామని వివరిం చారు. కాకినాడ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో శుక్రవా రం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌ హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు జిల్లా పోలీసుశాఖ నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సం దర్భంగా పవన ప్రసంగిస్తూ జిల్లా అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను శాఖలవారీగా వివరి స్తూ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా జిల్లాలో 1,50,475 మంది రైతులకు రూ.102కోట్లు తొలివిడతగా జమ చేశామన్నారు. ‘స్ర్తీశక్తి పథకం ద్వా రా మహిళలకు 187 ప్రత్యేక బస్సుల్లో ఉచిత ఆ ర్టీసీ ప్రయాణం అందిస్తున్నాం. తల్లికి వందనం పథకం ద్వారా 2,79,312మంది విద్యార్థుల తల్లు లు ఖాతాల్లో ఒకొక్కరికి రూ.13వేలు జమ చేసి ఇచ్చిన హామీని నెరవేర్చాం. అంతర్జాతీయ యో గా దినోత్సవంలో పాల్గొన్న 5వేల మంది యోగా శిక్షకులు, 8లక్షల ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. నెల నెలా 2,69,148మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల కింద రూ.116కోట్లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ఇది. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో రూ.118.46 కోట్ల వేతనాల కోసం ఖర్చుచేసి తద్వారా రూ.93కోట్లు మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధుల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు నిర్వహించాం. ఇప్పటివరకు జిల్లాలో 107 జాబ్‌ మేళాలు నిర్వహించి ఏడు వేలమంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాం. ప్రతి నియోజకవర్గంలో స్కిల్‌ హబ్‌, పార్లమెంట్‌ పరిధిలో జేఎన్‌టీయూ కాకినాడలో స్కిల్‌ కాలేజ్‌ ప్రారంభించాం.’ అని వివరించారు.

పీ4లో 90వేల బంగారు కుటుంబాలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 పథకం కింద ఇప్పటివరకు జిల్లాలో 90,044 బం గారు కుటుంబాలను గుర్తించాం. వీరిలో ఇప్ప టివరకు 74,658 కుటుంబాలను 12,501మంది మార్గదర్శకులు దత్తత తీసుకుని వారి సామాజి క, ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. జిల్లాలో ఈ నెలాఖరుకు 11,769 పేదల గృహాలు పూర్తి చేయబోతున్నాం. వీటిలోకి లబ్ధిదారులతో ఈనె లాఖరుకు గృహప్రవేశం చేయించబోతున్నాం. పేదలకు పెద్దదిక్కయిన జీజీహెచలో రూ.402కో ట్లతో కొత్తగా ఓపీడీ, ఐపీడీ బ్లాకుల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. డిసెం బరు నాటికి జిల్లాకు 50 కొత్త విద్యుత బస్సులు రాబోతున్నాయి. మరోపక్క జిల్లాలో 1,241 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియను ఈనెలాఖరుకు పూర్తి చేస్తున్నాం. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల్లోని 1876 పాఠశాలలు, 141 కళాశాలల్లో చదువుతున్న 3,24,276 మంది విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాఽధ్యాయులను పరస్పరం సమన్వయపరుస్తూ మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ను ఒక పండగలా నిర్వహించాం. జిల్లాలో 11 అన్న క్యాంటీన్ల ద్వారా పట్టణాల్లో పేదలకు రూ.5కే ఆకలి తీరుస్తున్న ప్రభుత్వం ఇది. జిల్లాలోని గృహ విద్యుత్‌ వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు ప్రతి నియోజకవర్గంలో పదివేలగృహాలపై పీఎం సూర్యఘర్‌ కింద రూఫ్‌ టాప్‌ సోలార్‌ యూనిట్ల ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టాం. ఇప్పటివరకు 10వేలమంది వీటి కోసం దరఖాస్తు చేసుకోగా 2,148మంది తమ ఇంటి పైకప్పులపై సోలార్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు.’ అని వివరించారు.

ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన

కార్పొరేషన్‌(కాకినాడ), ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో పోలీస్‌, ఎన్‌సీసీ, దళాలు నిర్వహించిన సంప్రదాయ కవాతు అల రించింది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలు ప్రభుత్వ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిని ప్రదర్శించాయి. తొ లుత దేవదాయశాఖ ఆధ్వర్యంలో అన్నవరం స త్యనారాయణస్వామి ఆలయ శకట ప్రదర్శన జ రిగింది. తదుపరి ప్రజారవాణాశాఖ స్త్రీశక్తి పథ కం, విద్యాశాఖ తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, పౌరసరఫరాలశాఖ దీపం- 2, వ్యవసాయశాఖ అన్నదాత సుఖీభవ, ముఖ్య ప్రణాళికాశాఖ జీరో పావర్టీ పీ4, జిల్లా నీటి యాజమాన్య సంస్థ(పల్లె పండుగ పంచాయతీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం), పిఠా పురంప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ(పాడా) శకటాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా క వాతు, శకటాల ప్రదర్శనకు బహుమతులు అం దజేశారు. ఈ ప్రదర్శనలో ఉత్తమ కవాతుకుగా ను ప్రథమబహుమతి ఏఆర్‌ పోలీస్‌ కంటింజెం ట్‌, ద్వితీయ బహుమతిని ఎన్‌సీసీ నావెల్‌ యూనిట్‌, ప్రత్యేక బహుమతి బ్యాండ్‌ మేనేజర్‌ భాస్కరరావుకు అందించారు. ఉత్తమ శకటాల ప్రదర్శనగాను జిల్లావిద్యాశాఖకు ప్రథమ బహు మతి, పీ4 ద్వితీయ, పాడా తృతీయ బహుమ తులను కైవసం చేసుకున్నాయి.

205మందికి.. ఉత్తమ సేవా పురస్కారాలు

-అందజేసిన డిప్యూటీ సీఎం పవన్‌

కలెక్టరేట్‌(కాకినాడ)/కాకినాడ సిటీ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉత్తమ సేవలందిం చిన 205మంది ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛం ద సంస్థల ప్రతినిధులకు ఉత్తమ సేవా పుర స్కారాలను డిప్యూటీ సీఎం పవనకల్యాణ్‌ అం దజేశారు. కాకినాడ పోలీసు పరేడ్‌ మైదానం లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఈ పురస్కా రాలు ఇచ్చి ఘనంగా సత్కరించారు.

జిల్లాస్థాయి అధికారులు వీరే: ఏ.శ్రీనివాస రావు(బీసీ కార్పొరేషన ఈడీ), కె.శ్రీరమణి (పె ద్దాపురం ఆర్డీవో), ఎస్‌.మల్లిబాబు(కాకినాడ ఆర్డీవో), ఎనవీవీ సత్యనారాయణ(హౌసింగ్‌ పీ డీ), ఎన.శ్రీధర్‌(జీజీహెచ అడ్మినిసే్ట్రటర్‌), డా క్టర్‌ అలీ(జిల్లా ఆయూష్‌ అధికారి), కె.పెద్దిరా జు(హేండ్‌లూమ్స్‌ టెక్స్‌టైల్స్‌ అధికారి), బి.శ్రీని వాసరావు(డీఎస్‌డీవో), జి.ప్రసాద్‌ (ఏపీఈపీ డీసీఎల్‌ ఎస్‌ఈ), గణపతి(జిల్లా పరిశ్రమలశా ఖాధికారి), సీహెచఎస్‌వీ ప్రసాద్‌(లీడ్‌ బ్యాం కు మేనేజర్‌), వి.రవికుమార్‌(డీపీవో), శ్రీని వాస్‌(పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ), ఎంవీఎస్‌ శం కర్‌రావు(పొల్యూషన కంట్రోల్‌బోర్డు ఈఈ), ఎం.శ్రీనివాసరావు(జిల్లాప్రజారవాణాశాఖ అధి కారి), జేఎనయూ లక్ష్మి(జిల్లా రిజిసా్ట్రర్‌), జి. కంఠు(ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ),పి.రమేష్‌(డీఈవో), శేషగిరి(ఇరిగేషన ఈఈ), కె.శ్రీనివాస్‌(డీసీఎం ఎస్‌ మేనేజర్‌) సేవా పురస్కారాలు తీసుకు న్నారు. వీరితోపాటు మరో 185మంది ప్రభు త్వ ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, ప్రము ఖులకు సేవా పురస్కారాలను అందజేశారు.

విభిన్న ప్రతిభావంతులతో పవన ముచ్చట్లు

కలెక్టరేట్‌(కాకినాడ),ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): కాకినాడ ఉమామనోవికాస కేంద్రంలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు, బధిరులతో డిప్యూటీ సీఎం పవనకల్యాణ్‌ ప్రత్యేకంగా ముచ్చటిం చా రు. స్వాతంత్య్ర వేడుకల్లో సభావేదిక నుంచి కిం దికి దిగి పరేడ్‌ మైదానంలోకి వెళ్లారు. వారిని దగ్గరికి తీసుకుని ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విభిన్నప్రతిభావంతులకు అందుతున్న సాయం పై కలెక్టర్‌ షానమోహనను అడిగి తెలుసు కున్నారు. విభిన్న ప్రతిభావంతులు చేసిన నృత్యానికి ప్రత్యేకంగా పవన అభినందించారు.

సెల్ఫీకోసం ఎగబడిన ప్రజలు

స్వాతంత్య్ర వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌తో సెల్ఫీ దిగడం కోసం అభిమానులు ఫోన్లు తీసుకుని ఎగబడ్డారు. స్వాతంత్య్ర వేడుక లు ముగిసిన తర్వాత పవన సభాస్థలం నుంచి కిందికి దిగారు. ఆ సమయంలో పక్కనే ఉన్న గ్యాలరీలో అభిమానులు, జనం పవనతో సెల్ఫీ దిగేందుకు మొబైల్‌ఫోన్లు తీసుకుని కేరింతలు కొట్టారు. వారి ఉత్సాహం చూసిన పవన వారి గ్యాలరీ దగ్గరికే వచ్చి కొంతమంది సెల్ఫీలు తీసుకునే అవకాశం ఇచ్చారు.

షెడ్యూల్‌కు ముందే పయనం

అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్‌కు ముం దే డిప్యూటీ సీఎం పవనకల్యాణ్‌ సభావేదిక నుంచి బయలుదేరి వెళ్లారు. కాకినాడ పోలీసు పెరేడ్‌ మైదానంలో ఉదయం 9గంటలకు జెం డా ఆవిష్కరణ ప్రారంభమైంది. తర్వాత ప్రసం గం, పురస్కారాలు అందజేసి డిప్యూటీ సీఎం ప వన ఉదయం 10.40గంటలకు సభావేదిక నుం చి దిగారు. షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 12గంటలకు వెళ్లాల్సి ఉండగా అమరావతి కార్య క్రమాల నేపథ్యంలో ముందే బయలుదేరారు.

Updated Date - Aug 16 , 2025 | 01:54 AM