పంచాయతీరాజ్‌కు డివిజన్ ఆఫీస్‌లు
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:58 AM
పంచాయితీరాజ్ వ్యవస్థ కార్యకలాపాలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు డివిజనల్ అభివృద్ధి అధికారి (డీడీవో) కార్యాలయాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
దివాన్‌చెరువు, డిసెంబరు4 (ఆంధ్రజ్యోతి) : పంచాయితీరాజ్ వ్యవస్థ కార్యకలాపాలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు డివిజనల్ అభివృద్ధి అధికారి (డీడీవో) కార్యాలయాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లాలో రాజమహేంద్రవరం, కొవ్పూరు డివిజన్ పరిధుల్లో గురువారం డీడీవో కార్యాలయాలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వర్చు వల్‌గా ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ లాలాచెరువు హౌసింగ్‌బోర్డు కాలనీలో రాజమహేంద్రవరం డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశా మన్నారు. రెవెన్యూ వ్యవస్థలో ఆర్డీవో విధానం ఉన్నట్టుగా పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి ఈ డివిజనల్ అభివృద్ధి అధికారి వ్యవస్థ ప్రవేశపెట్టారని చెప్పారు. డివిజనల్ గ్రామ పంచాయతీ అధికారి, డీడీవో ఉపాధి హామీ పథకం(నరేగా) అధికారులు ఒకో చోట నుంచి పనిచేయడం ద్వారా పరిపాలనలో వేగం,జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ఇప్పటి వరకూ అభివృద్ధి పనుల నిమిత్తం మండలస్థాయిలో ఎంపీడీవోను సంప్రదించేవారని ఇకపై డివిజనల్ స్థాయిలోనూ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను పర్యవేక్షించడానికి ఈ వ్యవస్థ దోహదపడుతుందన్నారు. గ్రామ సచివాలయాల పనితీరును విశ్లేషించి లోపాలను తక్షణమే పరిష్కరించే విధంగా ఈ కార్యాలయాలు పనిచేస్తాయని చెప్పారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చాలాకాలం తరువాత పంచాయితీరాజ్ పరిపాలనలో క్రమబద్ధీకరణ సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, డీపీవో వి.శాంతమణి, డీడీవో పి.వీణాదేవి, డీఎల్‌పీవో ఎం.నాగలత, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బి.వి.రెడ్డి, డీఈ శ్రీనివాస్, డీఆర్ డీఏ పీడీ ఎన్వీవీవీఎస్.మూర్తి, డ్వామా పీడీ నాగమహేశ్వరరావు, సమగ్రశిక్ష పీవో ఎస్.సుభాషిణి , హౌసింగ్ పీడీ నాతి బుజ్జి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అవినాష్, ఎంపీడీవో జె.ఝాన్సీ, తహశీల్దార్ దేవి పాల్గొన్నారు.
కొవ్వూరులో ఏర్పాటు
కొవ్వూరు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండే విధంగా డిప్యూటీ సీఎం కొణిదల పవన్‌కల్యాణ్ చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరు డీడీవో కార్యాలయాన్ని గురువారం ప్రారంభించి మాట్లాడారు.రూ. 19 లక్షలతో డీడీవో కార్యాలయాన్ని ఆధునీకరించా మ న్నారు.కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, మద్దిపట్ల శివరామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్, ఎంపీపీ కాకర్ల నారాయుడు, సూరపనేని చిన్ని, డీఎల్‌డీవో ఎ.స్లీవారెడ్డి పాల్గొన్నారు.