కొత్తకోటపాడులో ప్రబలిన డయేరియా
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:58 AM
రంగంపేట, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కొత్త కోటపాడులో నాలుగు డయేరియా కేసులు నమోదు కావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సోమవారం డయేరియా కేసులు నమోదు కావడంతో విషయాన్ని డీఎంఅండ్‌హెచ్‌వోకి తెలియజేయడంతో వెంటనే డిప్యూ
నాలుగు కేసుల నమోదు
వినాయకచవితి ప్రసాదంతో
ఫుడ్ పాయిజనింగ్ : అధికారులు
నియంత్రణలో పరిస్థితి : డీఎంఅండ్‌హెచ్‌వో
రంగంపేట, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కొత్త కోటపాడులో నాలుగు డయేరియా కేసులు నమోదు కావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సోమవారం డయేరియా కేసులు నమోదు కావడంతో విషయాన్ని డీఎంఅండ్‌హెచ్‌వోకి తెలియజేయడంతో వెంటనే డిప్యూటీ డీఎంహెచ్‌వో, జిల్లా సర్వేలెన్స్ అధికారి, ఎపిడెమియాలజిస్ట్, జిల్లా బృందం, ఫుడ్ ఇన్స్పెక్టర్ కొత్త కోటపాడు వచ్చి నమోదైన డయేరియా కేసులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. రంగంపేట పీహెచ్‌సీ, ప్రత్యేక డాక్టర్ల బృందంతో మెడికల్ క్యాంప్ నిర్వహించి బాధితులకు చికిత్స అందిం చారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, పర్యవేక్షక సిబ్బంది ఇళ్ల దగ్గరకు వెళ్లి కేసులపై విచారణ జరిపారు. అలాగే నీటి, మల నమూనాలను సేకరించి పరిశీలన కొనసాగుతుంది. పరిస్థితి నియంత్రణలో ఉందని డీఎం అండ్‌హెచ్‌వో కె.వెంకటేశ్వరరావు తెలిపారు. వినాయక చవితి ప్రసాదం పులిహోర తినడంతో అది ఫుడ్‌పాయిజనింగ్ కారణంగానే డయేరియా వచ్చి ఉండవచ్చని వైద్యాధికారులు తెలిపారు. ఇదే నిజమైతే డయేరియా కేసులు ఇంకా పెరగొచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. అలాగే కొత్తకోటపాడు, పాత కోటపాడు గ్రామస్తులు కొత్త నాయకంపల్లిలో ఉ న్న నూతినీటిని తాగుతారని తెలపడంతో ఆ నీటి నమూనాలను కూడా సేకరించారని తెలిపారు. గ్రామంలో కేసులు నమోదైన ఇళ్ల దగ్గర పరిసరాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టారు. ప్రజలకు డయేరియాపై ఆరోగ్య విద్యా కార్యక్రమం నిర్వహించారు. నాయకంపల్లిలో ఉన్న నుయ్యి కూడా అపరిశుభ్రంగా ఉందని కొందరు గ్రామస్తులు చెప్తున్నారు.