Share News

దబ్బాదిలో ప్రబలిన డయేరియా

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:58 AM

రౌతులపూడి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ రాఘవపట్నం గ్రామశివారు దబ్బాదిలో డయేరియా ప్రబలింది. గ్రామానికి చెందిన వం తల చెల్లయ్యమ్మ(65) మృతిచెందింది. వెలుగు లోవరాజు, వంతు నాగసీత, వంతు గంగాభవాని, రొబ్బా వీరబాబుతో సహా సూమారు 44 మంది రౌతులపూడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రు. వారిలో 9 నుంచి 12 ఏళ్లు ఉన్న పిల్లలు 12 మందికి పైగా ఉన్నారు. మంచాలు సరిపోక

దబ్బాదిలో ప్రబలిన డయేరియా
రౌతులపూడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

వృద్ధురాలి మృతి

రౌతులపూడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 44 మంది గిరిజనులు

వారిలో 12 మందికి పైగా పిల్లలు

పులిహోర తిన్నామంటున్న గ్రామస్తులు

రౌతులపూడి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ రాఘవపట్నం గ్రామశివారు దబ్బాదిలో డయేరియా ప్రబలింది. గ్రామానికి చెందిన వం తల చెల్లయ్యమ్మ(65) మృతిచెందింది. వెలుగు లోవరాజు, వంతు నాగసీత, వంతు గంగాభవాని, రొబ్బా వీరబాబుతో సహా సూమారు 44 మంది రౌతులపూడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రు. వారిలో 9 నుంచి 12 ఏళ్లు ఉన్న పిల్లలు 12 మందికి పైగా ఉన్నారు. మంచాలు సరిపోకపోవ డంతో డీసీహెచ్‌ఎస్‌ స్వప్న ఆదేశాలు మేరకు తుని ఏరియా ఆసుపత్రి తరలించారు. పాడేరు ఆసుపత్రిలో లోవరాజు, రమణ వైద్యం పొ ందు తున్నారు. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వంతు రామయ్యమ్మ, నాగమణి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు గ్రామంలో మోద కొండమ్మతల్లి ఆలయానికి మొక్కు తీర్చుకోవడా నికి దబ్బాది, సుందరకోట, అనసగిరి గ్రామాలకు చెందినవారు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు వ్యాన్‌పై 60 మందితో బయలుదేరారు. మార్గమధ్యంలో నర్శీపట్నం దాటిన తరువాత రాత్రి 8 గంటల సమయంలో వారి వెంట పట్టుకుని వెళ్లిన పులి హోర తిన్నారు. ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. స్నానాలు చేసి రామయ్యమ్మ,నాగమణి మొక్కు తీర్చుకు న్నారు. తర్వాత వంటలు చేసుకుని తినడానికి సిద్ధంగా ఉన్న సమయంలో కొందరికి కడుపు నొప్పితో విరోచనాలు పట్టుకున్నాయి. వారిని పా డేరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం వారికి బాగా ఉండడంతో వారితో పాటు మిగిలిన వారు బస్సులో బయలు దేరి ఆదివారం అర్ధరాత్రి స్వగ్రామం దబ్బాది చేరుకున్నారు. అనంతరం వారికి విరోచనాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వంతల చెల్లయ్యమ్మ మృతిచెందడంతో ఒక్కసారిగా గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వైద్యం సిబ్బందికి విషయం తెలియడంతో హుటాహుటిన రౌతు లపూడి ఆసుపత్రికి తరలించి వైద్యం అంది స్తు న్నారు. గ్రామస్తులు తిన్న పులిహోరను వైద్య సిబ్బంది శాంపిల్‌ తీసి టెస్టులకు పంపించారు. దబ్బాది గ్రామస్తులంతా తమ వారి కోసం రౌతు లపూడి ఆసుపత్రికి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల స త్యప్రభ వారికి మెరుగైన వైద్యం అంది ంచాలని వైద్యులను ఆదేశించారు. బాధితులకు టీడీపీ యువనేత సోమ రౌతు చంద్రమౌళి భోజనాలు అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని జిల్లా వైద్యా ధికారి డా.నరసింహ నాయక్‌ పరామర్శిం చారు. ఆసుపత్రిలో పరిస్థితులను పరిశీలించి వైద్య సిబ్బందికి సూచనలిచ్చారు.

Updated Date - Jun 17 , 2025 | 12:58 AM