నిలకడగా గోదావరి ప్రవాహం
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:41 AM
ధవళేశ్వరం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి నిలకడగా ప్రవహిస్తుంది. సోమవారం తెల్లవారుజామున 3గంటలకు
ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్నమొదటి ప్రమాద హెచ్చరిక
13.10 అడుగులకు చేరిన నీటి మట్టం
ఎగువ ప్రాంతాల్లో గోదావరి తగ్గుముఖం
ధవళేశ్వరం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి నిలకడగా ప్రవహిస్తుంది. సోమవారం తెల్లవారుజామున 3గంటలకు నీటి మట్టం 13.10 అడుగుల వరకు పెరిగింది. ఆపై 16గంటలు నిలకడగా కొనసాగుతుంది. సోమవారం రాత్రి 7గంటలకు నీటి మట్టం అదే రీడింగ్ వద్ద కొనసాగుతుండగా కాటన్ బ్యారేజ్ ద్వారా 11,79,236 క్యూసెక్కులు సముద్రంలోకి ప్రవహిస్తుంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. కాగా ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
భద్రచాలం, కాలేశ్వరం వద్ద...
భద్రచాలం వద్ద 48.10 అడుగుల వరకు పెరిగిన నీటి మట్టం 12గంటల పాటు నిలకడగా కొనసాగి తగ్గుముఖం పడుతుంది. సోమవారం రాత్రి 7గంటలకు నీటి మట్టం 43.60 అడుగులకు చేరుకుంది. ఎగువున కాళేశ్వరం వద్ద 12.570 మీ టర్ల వరకు పెరిగిననీటి మట్టం తగ్గుతూ సోమవారం సాయంత్రానికి 9.650 మీటర్లకు చేరుకుంది. పేరూరు వద్ద 16.850మీటర్ల వరకు పెరిగి తగ్గుతూ 14.370 మీటర్లకు చేరుకుంది. దుమ్ముగూడెం వద్ద తగ్గుతున్న నీటి మట్టం 11.800 మీటర్లు, కూనవరం వద్ద 19.610, కుంట వద్ద 10.820, పోలవరం వద్ద 12.750 మీటర్లుగా నీటి మట్టం చేరుకుంది. రాజమహేంద్రవరం రైల్వే బ్రి డ్జి వద్ద 16.540 మీటర్లు, ధవళేశ్వరం వద్ద 13.10 అడుగుల వద్ద నీటి మట్టం నిలకడగా ఉంది.