Share News

గోదావరి పరవళ్లు

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:30 AM

ధవళేశ్వరం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. సోమవారం ఉదయం 4.38లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేయగా సాయంత్రానికి కాటన్‌ బ్యారేజ్‌ మొత్తం గేట్లను పూర్తిగా ఎత్తివేసి ఎగు

గోదావరి పరవళ్లు
ధవళేశ్వరంలో కాటన్‌ బ్యారేజ్‌ గేట్ల ద్వారా ప్రవహిస్తున్న వరద నీరు

కాటన్‌ బ్యారేజ్‌ నుంచి 6,07,682 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల

ధవళేశ్వరం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. సోమవారం ఉదయం 4.38లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేయగా సాయంత్రానికి కాటన్‌ బ్యారేజ్‌ మొత్తం గేట్లను పూర్తిగా ఎత్తివేసి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని వచ్చింది వచ్చినట్టే దిగువకు వదిలివేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి కాటన్‌ బ్యారేజ్‌ ద్వారా 6,07, 682 క్యూసెక్కులు సముద్రంలోకి ప్రవహిస్తోంది. దీంతో ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 9.10 అడుగులుగా నమోదయింది. కాగా ఎగువున భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుదల నెమ్మదించి సాయంత్రానికి 37.70 అడుగులకు చేరుకుంది. ఎగువున కాళేశ్వరం, పేరూరు, దుమ్ముగూడెం వద్ద నీటి మట్టం తగ్గుముఖం పట్టింది.

ఆల్‌ క్లియర్‌ పొజిషన్‌ ఎందుకు?

ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వస్తున్న సమయంలోనే మొత్తం కాటన్‌ బ్యారేజ్‌ గేట్లను పూర్తిగా ఎత్తివేసి (ఆల్‌ క్లియర్‌ పొజిషన్‌) వచ్చిన ప్రవాహాన్ని వచ్చినట్టు దిగువకు వదిలి వేస్తూ ఉంటారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకుండానే ఆల్‌ క్లియర్‌ పొజిషన్‌లో కాటన్‌ బ్యారేజ్‌ గేట్లు ఎత్తి వరద నీటిని సముద్రంలోకి వదిలి వేయాల్సిన పరిస్థితి ఏమిటో అధికారులకే తెలియాలి.

Updated Date - Aug 19 , 2025 | 12:30 AM