Share News

గోదావరి పరవళ్లు

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:09 AM

ధవళేశ్వరం, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ సముద్రంలోకి ప్ర

గోదావరి పరవళ్లు
ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ నుంచి విడుదలవుతున్న వరద నీరు

5,06,438 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల

ధవళేశ్వరం, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ సముద్రంలోకి ప్రవహిస్తోంది. ఆదివారం సాయంత్రానికి కాటన్‌ బ్యారేజ్‌ ధవళేశ్వరం, ర్యాలి ఆర్మ్‌లోని మొత్తం గేట్లను 1.5 మీటర్లు.. మద్దూరు, విజ్జేశ్వరం ఆర్మ్‌లోని మొత్తం గేట్లను మీటరు మేర పైకి ఎత్తి 5,06,438 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 10 అడుగులుగా నమోదైంది. ఎగువున భద్రాచలం వద్ద 36.10 అడుగుల వరకు పెరిగిన నీటి మట్టం నిలకడగా కొనసాగుతోంది.

Updated Date - Sep 15 , 2025 | 12:09 AM