ధవళేశ్వరంలో వరద ఉధృతి తగ్గుముఖం
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:39 AM
ధవళేశ్వరం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): నాలుగు రోజులుగా ఉధృతంగా ప్రవహించిన గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాట
ప్రమాద హెచ్చరికలు ఉపసంహరణ
వేగంగా తగ్గుతున్న నీటి మట్టం
ధవళేశ్వరం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): నాలుగు రోజులుగా ఉధృతంగా ప్రవహించిన గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి 14.30 అడుగుల వరకు పెరిగిన నీటి మట్టం శుక్రవారం సాయంత్రం నుంచి తగ్గుతూ శనివారం తెల్లవారుజామున 2గంటలకు 13.70 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ఆపై వేగ ంగా తగ్గుతున్న నీటి మట్టం 17గంటల వ్యవధిలో శనివారం రాత్రి 7గంటలకు 11.70 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఈ సమయంలో కాటన్ బ్యారేజ్ నుంచి 10,04,000వేల క్యూ సెక్కులు దిగువకు వదిలా రు. రాత్రి 8గంటలకు నీటి మట్టం 11.50 అడుగులకు చేరుకోగా 9,57,297 క్యూ సెక్కులు సముద్రంలోకి ప్రవహిస్తుంది. ఎగువున అన్నిప్రాంతాల్లో నీటి మట్టం తగ్గుతోంది. భద్రాచలం వద్ద తగ్గుతున్న నీటి మట్టం శనివారం రాత్రి 8గంటలకు 36 అడుగులకు చేరుకుంది.