ప్రమాద ఘంటికలు
ABN , Publish Date - Sep 15 , 2025 | 12:27 AM
ప్రమాదాలు చెప్పిరావు. మనం ఎంత జాగ్రత్తగా వెళ్లినా ఎదుట మనిషి కూడా అంతే జాగ్రత్తగా రాకపోతే ప్రమాదం బారిన పడాల్సిందే. ఇటీ వల రోడ్డుపై పార్కింగ్ చేసిన వాహనాలను ఢీకొని ప్రమాదాల బారిన పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన రహదా రులపై నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను పార్కింగ్ చేసి ప్రమాదాలకు కారణమవుతు న్నారు. ఈ విషయాలన్నీ సంబంధిత అధికారు లకు తెలిసినా వారు ఎందుకనో పట్టించుకోరు.
గోకవరం- రాజమహేంద్రవరం రోడ్డుపై పలు పరిశ్రమల వాహనాలు
నిబంధనలకు విరుద్ధంగా నిలుపుదల
ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
అనేక ప్రమాదాలు.. పలువురి మృత్యువాత
గోకవరం, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రమాదాలు చెప్పిరావు. మనం ఎంత జాగ్రత్తగా వెళ్లినా ఎదుట మనిషి కూడా అంతే జాగ్రత్తగా రాకపోతే ప్రమాదం బారిన పడాల్సిందే. ఇటీ వల రోడ్డుపై పార్కింగ్ చేసిన వాహనాలను ఢీకొని ప్రమాదాల బారిన పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన రహదా రులపై నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను పార్కింగ్ చేసి ప్రమాదాలకు కారణమవుతు న్నారు. ఈ విషయాలన్నీ సంబంధిత అధికారు లకు తెలిసినా వారు ఎందుకనో పట్టించుకోరు. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి, బావాజీపేట, వీరలింకపల్లి గ్రామాల సమీపంలో హెచ్‌పీసీ ఎల్, ఐవోసీఎల్, హెచ్‌పీ గ్యాస్, ఇథనాల్ సంస్థ లు ఉన్నాయి. వాటి నుంచి ఆయిల్, గ్యాస్‌ను బ యట ప్రాంతాలకు తరలించేందుకు వందలాది భారీ వాహనాలు(ట్యాంకర్లు, ఇతర వాహనాలు) నిత్యం రాకపోకలు సాగిస్తుంటారయి. అసలే ఇరుకుగా ఉండే ఈ (గోకవరం- రాజమహేంద్ర వరం) ప్రధాన రహదారిపై ఇతర వాహనాల రాకపోకల కంటే ఈ సంస్థలకు చెందిన వాహ నాలే వందల సంఖ్యలో ప్రయాణం చేస్తుం టాయి. ఆయా కంపెనీల నిర్వహణ సమయం లో లోపలికి లోడింగ్‌కు వెళ్లేటపుడు, లోడింగ్ పూర్తయ్యాక భారీ వాహనాలను ప్రధాన రహ దారిపై పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఇతర వాహనదారులు ఆయా ప్రాంతాల్లో ప్రయాణిం చేందుకు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నా రు. రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా వాహనా లను పార్కింగ్ చేయడం, ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వకుండా ట్యాంకర్లను కంపెనీల నుంచి ఒకే సారి రహదారిపైకి పంపిస్తుండడం వల్ల ఎప్పు డు ఏ ప్రమాదం ముంచుకోస్తోందోనని స్థాని కులు భయాందోళన చెందుతున్నారు. గతంలో హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్, హెచ్‌పీ గ్యాస్ కంపె నీల వద్ద ట్యాంకర్ల డ్రైవర్ల అజాగ్రత్త వల్ల పలు వురు మృత్యువాత పడిన సంఘటనలున్నాయి. పది రోజుల క్రితం ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొని గుమ్మళ్లదొడ్డికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయా కం పెనీల వద్ద పార్కింగ్ చేసుకునేందుకు పా ర్కింగ్ ప్రదేశాలు ఉన్నా ఆ విషయాన్ని విస్మరిం చి ప్రధాన రహదారిపైనే వాహనాలను ఉంచ డం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో రోడ్లపై ట్యాంకర్లను పార్కింగ్ చేయకుండా ఉండేందుకు స్ధానిక పోలీసులు కా నిస్టేబుళ్లను నియమించేవారు.రానురాను సిబ్బం ది కొరత పేరుతో కాపలాను ఉపసంహరిం చారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి హెచ్‌పీసీ ఎల్, ఐవోసీఎల్, హెచ్‌పీ గ్యాస్, ఇథనాల్ కం పెనీల వద్ద ప్రధాన రహదారిపై వాహనాలను పార్కింగ్ చేయకుండా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.