Share News

డొక్కా సీతమ్మ జీవిత చరిత్రపై...

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:38 AM

పి.గన్నవరం, ఆగస్టు 24(ఆంధ్ర జ్యోతి): అపర అన్నపూర్ణగా ప్రసిద్ధి గాంచిన డొక్కా సీతమ్మ జీవి త చరిత్ర ను ఇప్పటికే వివిధ రూపాల్లో తెరకెక్కిం చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు పలు తరగతుల పాఠ్య పుస్తకాల్లో ప్రచురిం చారు. తాజాగా గౌరి ప్రసాద్‌ మీడియా బ్లాక్‌అండ్‌వైట్‌ మూవీ మార్క్‌ సంస్థ అన్నపూ

డొక్కా సీతమ్మ జీవిత చరిత్రపై...
లంకలగన్నవరం కోడేరు రేవు వద్ద చిత్రీకరిస్తున్న దృశ్యం

లంకలగన్నవరంలో డాక్యుమెంటరీ చిత్రీకరణ

పి.గన్నవరం, ఆగస్టు 24(ఆంధ్ర జ్యోతి): అపర అన్నపూర్ణగా ప్రసిద్ధి గాంచిన డొక్కా సీతమ్మ జీవి త చరిత్ర ను ఇప్పటికే వివిధ రూపాల్లో తెరకెక్కిం చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు పలు తరగతుల పాఠ్య పుస్తకాల్లో ప్రచురిం చారు. తాజాగా గౌరి ప్రసాద్‌ మీడియా బ్లాక్‌అండ్‌వైట్‌ మూవీ మార్క్‌ సంస్థ అన్నపూర్ణతల్లి బువ్వమ్మ పేరుతో డాక్యుమెంటరీని చిత్రీకరిస్తున్నారు. డైరెక్టర్‌ సురేష్‌ లంకలపల్లి నూతన నటీనటులతో పలు దృశ్యాలను ఆదివారం డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని లంకలగన్న వరంలో గోదావరి తీర ప్రాంతంలో చిత్రీకరించారు. దర్శకుడు సురేష్‌ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ అడిగినవారికి లేదనకుండా అన్నం వండి వడ్డించేవారని.. ఆమె జీవిత విశేషాలు, అపురూప ఘట్టాలను తెరకెక్కిస్తున్నామన్నారు. 2రోజులు పాటు లంకలగన్న వరంలో డొక్కా సీతమ్మ నివా సం, గోదావరి నదిపరివాహక ప్రాంతాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండ లం ఆయో ధ్యలంకలో పలు సన్నివేశాలను చిత్రీకరిస్తామని చెప్పారు. ఈ డాక్యుమెంటరీకి నిర్మాతగా సీరాజ్‌, ఖాదర్‌ వ్యహ రించగా సింహరాశి డైరెక్టర్‌ సముద్ర, షిలిక లేనౌజా, ఆదిల్‌, రమేష్‌, కుసుమ తదితర నూత న నటులు నటిస్తున్నారని.. సంగీతం సాకేత్‌వేణి అందించగా ఆర్య సాయి కృష్ణ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. డాక్యుమెంటరీని అక్టోబర్‌లో విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌ పి.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

Updated Date - Aug 25 , 2025 | 12:38 AM