పోలీస్‌స్టేషన్‌కు రాకపోతే కేసు పెడతాం
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:29 AM
బిక్కవోలు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురానికి చెందిన అమలాపురపు శ్రీనివాస్ ఫేక్ ఫోన్ కాల్‌కు బలై రూ.30వేలు పోగొట్టుకున్నాడు. బిక్కవోలు ఎస్‌ఐ వి.రవిచంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... గురువారం ఉదయం పది గంటలకు 9493191296 నెంబరు నుంచి శ్రీనివాస్‌కు ఫోన్ వ
పోలీసుల పేరిట ఫోన్ కాల్
రూ.30 వేలు పోగొట్టుకున్న బలభద్రపురం వాసి
పోలీసులకు ఫిర్యాదు
బిక్కవోలు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురానికి చెందిన అమలాపురపు శ్రీనివాస్ ఫేక్ ఫోన్ కాల్‌కు బలై రూ.30వేలు పోగొట్టుకున్నాడు. బిక్కవోలు ఎస్‌ఐ వి.రవిచంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... గురువారం ఉదయం పది గంటలకు 9493191296 నెంబరు నుంచి శ్రీనివాస్‌కు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి మేం కుప్పం పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు దొంగతనపు బంగారం కొనుగోలు చేశారు. వెంటనే పోలీస్‌స్టేషన్‌కు రావాలని లేకపోతే కేసు ఫైల్ చేస్తామని హెచ్చరించాడు. ఇలా పలుమార్లు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు రావాలని లేకపోతే రూ.50 వేలు ఫోన్‌పే చేయాలని ఒత్తిడి చేశాడు. దీంతో సాయంత్రం రూ.30వేలు ఫోన్ పే చేశాడు శ్రీనివాస్. ఇది నకిలీ కాల్ అని శ్రీనివాస్ కు మారుడు గుర్తించాడు. తరువాత అనుమానం రావడంతో పోలీసులను సంప్రదించారు. ఇది సైబర్ మోసమని తెలపడంతో వెంటనే శ్రీనివాస్ సైబర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేశాడు. వారి కంప్లైంట్‌కు రిఫరెన్స్ నెంబరు 30208240020237 కేటాయించారు. ఆ తరువాత 1930 నెంబర్ నుంచి కాల్ వచ్చి ఈ మోసంపై బిక్కవోలు పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు ఇవ్వాలని శ్రీనివాస్‌కు సూచించడంతో వారు తమకు ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ వివరించారు.