చిక్కితే ఖాతా ఖాళీ!
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:26 AM
ఇది పోలీసులు తరచు చేసే హెచ్చరిక. మీరు ఎక్కడికైనా వెళితే ఇంట్లోని బంగారం, డబ్బు సురక్షితంగా దాచుకొని వెళ్లాలని చెబుతారు. లేదంటే తమకు సమాచారం ఇస్తే మీ ఇంటికి రక్షణ కల్పిస్తామని కూడా ఈమధ్య హోరెత్తిస్తున్నారు. ఒకవేళ సొత్తు చోరీకి గురైనా పోలీసుల దర్యాప్తులో దొంగలు పట్టుబడటం, సొత్తు రికవరీ చేయడం కూడా మనకు తెలుసు. ఇప్పుడు దొంగలు పడుతున్నది ఇళ్లలో కాదు..
చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు
మళ్లీ చేతికి చేరడం అసాధ్యమే
అప్రమత్తతే ఆయుధం
దొంగలున్నారు.. జాగ్రత్త!.
ఇది పోలీసులు తరచు చేసే హెచ్చరిక. మీరు ఎక్కడికైనా వెళితే ఇంట్లోని బంగారం, డబ్బు సురక్షితంగా దాచుకొని వెళ్లాలని చెబుతారు. లేదంటే తమకు సమాచారం ఇస్తే మీ ఇంటికి రక్షణ కల్పిస్తామని కూడా ఈమధ్య హోరెత్తిస్తున్నారు. ఒకవేళ సొత్తు చోరీకి గురైనా పోలీసుల దర్యాప్తులో దొంగలు పట్టుబడటం, సొత్తు రికవరీ చేయడం కూడా మనకు తెలుసు. ఇప్పుడు దొంగలు పడుతున్నది ఇళ్లలో కాదు.. జేబు దొంగలూ కాదు.. మీ చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌లోనే ఓ కన్నేస్తారు. ఏదొక ఎత్తుగడతో మాయ చేసో, బెదిరించో బ్యాంకు అకౌంట్ల నుంచి మొత్తం దోచేస్తున్నారు. ఇందులో ధనవంతులే కాదు.. చిరుద్యోగులు, ఉద్యోగ విరమణ చేసినవారు, పింఛను పొందుతున్న వృద్ధులు సైతం ఈ ఆన్‌లైన్ మోసంలో చిక్కి బలైపోతున్నారు.
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
సైబర్ క్రైం విషయంలో దొంగా పోలీస్ ఆటలో దొం గలదే పైచేయిగా నిలుస్తోంది. ఆధునిక సాంకేతికతను పోలీసులు అర్థంచేసుకొనేలోపుగా సైబర్ బూచోళ్లు ఖాతా లు ఖాళీ చేసేస్తున్నారు. ఇప్పటివరకూ సైబర్ నేరాల్లో గంటలోపుగా ఫిర్యాదుచేస్తే డబ్బు వెనక్కి రప్పించే అవ కాశాలు సగమన్నా ఉండేవి. ఇప్పుడు ఆ సమయం నిమి షాల్లోకి వచ్చేసింది. సొమ్ము ఒక్కసారి ఖాతా దాటితే దాదాపుగా బూడిదలో పోసిన పన్నీరేనని కేసులు రుజు వు చేస్తున్నాయి. అధిక శాతం పోలీసులకు ఈ నేరాలపై అవగాహన లేదు. ఎఫ్‌ఐఆర్ ఎలా, ఏ సెక్షన్ల ప్రకారం నమోదుచేయాలో కూడా తెలియక తికమకపడుతున్నా రు. బాధితుడు మోసపోయానని గుర్తించి తేరుకొనే లోపుగా ఆ డబ్బులు నాలుగైదు దశలు దాటిపోతోంది. కొన్నేళ్ల కిందట లాటరీల పేరుతో నైజీరియన్లు సైబర్ నేరాలకు తెరతీశారు. తర్వాత మార్పులు సంతరించుకుం టూ బ్యాంకు ఓటీపీ, ఆధార్ అప్‌డేట్, ప్రభుత్వ పథకాల పేరుతో, కొరియర్, కొద్ది పెట్టుబడితో భారీ రాబడి, యా ప్‌లు ఇలా రకరకాల మోసాలు సాగుతూ డిజిటల్ అరె స్టుల వరకూ పరిస్థితి చేరింది. రోజుకో మోసపు ఆలోచ నతో కోట్ల సొమ్మును సైబర్ బూచోళ్లు తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు. బ్యాంకులు, ప్రభుత్వాలు, సాఫ్ట్‌వే ర్లు, సర్వర్ల విషయంలో ఎన్ని జాగ్రత్తలు పా టిస్తున్నా అవన్నీ బలాదూర్ అని నేరగాళ్లు నిరూపిస్తున్నారు.
ఫ రికవరీ దైవాధీనం
సైబర్ క్రైంలో రికవరీ శాతం స్వల్పం. రూ.10 కోట్లు పోగొట్టుకుంటే రూ.లక్ష కూడా వెనక్కి రప్పించలేని పరి స్థితి. దర్యాప్తు ఎంత ముమ్మరంగా ఖాతా నుంచి మాయ మైన డబ్బులు వెనక్కి రావడం లేదు. ఖాతా నుంచి డబ్బులు దొంగిలించారని బ్యాంకు వాళ్లకు చెబితే.. పోలీ సులకు ఫిర్యాదు చేయండని ఓ సలహా పడేస్తున్నారు.
ఏపీకే క్లిక్ చేస్తే.. ఖతం
ఆర్టీవో, ఎస్‌బీఐ, పీఎం కిసాన్ పేరుతో ఏపీకే ఫైల్స్‌తో బురిడీ
(ఆంధ్రజ్యోతి-పిఠాపురం)
పిఠాపురం పట్టణానికి చెందిన సత్యప్రసాద్‌కు తెలిసిన మిత్రుడు వాట్సాప్ నుంచి సందేశం వచ్చింది. మీకు పీఎం కిసాన్ పడిందా లేదా చూసుకోండి అంటూ ఏపీకే ఫైల్‌ను అతను పంపినట్టు పంపారు. దాన్ని క్లిక్ చేశాడు. ఫోన్ హేక్ అయింది. ఉన్న రెండు బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు ఖాళీ కావడంతోపా టు ఇదే రీతిలో అతని పేరుతో కాంటాక్టు లిస్ట్‌లో ఉన్నవారందరికి మెసేజ్‌లు వెళ్లాయి. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన నరసింహరావుకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. మీ ఎస్‌బీఐ రివార్డ్స్ అప్‌డేట్ చేసుకోండి అని అంతే క్లిక్ చేశాడు. అతని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.6,500 డెబిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఇలా రకరకాల ఏపీకే ఫైల్స్ తెలుసున్న వ్యక్తులు, స్నేహితులు, బంధువుల దగ్గర నుంచి వచ్చినట్టు వాట్సాప్‌ల ద్వారా వ్యక్తిగతంగా, గ్రూప్‌ల్లో రావడంతో మోసపోతున్నారు.
ఫ డిజిటల్ అరెస్టు.. రూ.34 లక్షలకు టోపీ
ముమ్మిడివరానికి చెందిన విశ్రాంతి మండల విద్యాశాఖాధికారి బొజ్జా రమణశ్రీకి ఈనెల 8న టెలిఫోన్ డిపార్టుమెంట్ పేరిట ఓ ఫోన్‌కాల్ వచ్చింది. మీ నంబరుపై బెంగళూరులో ఒక సీరియస్ కేసు నమోదై ఉందని, మహారాష్ట్ర కెనారా బ్యాంకులో ఏటీఎం నేరం ఉందని, రూ.3 కోట్ల కుంభకోణంలో రూ.75 లక్షలు మీకు ముట్టిందని డిజిటల్ అరెస్టు పేరిట బెదిరించారు. విశ్రాంత ఎంఈవోను బెదిరిం చి ఆయన అకౌంట్‌లోని రూ.15 లక్షలు లాగేశారు. తర్వాత పీఎఫ్ లోన్ తీసుకోమని వారే చెప్పి 12న రూ.9.80 లక్షలు, 15న రూ.9.80 లక్షలు.. మూడు దఫాలుగా రూ.34 లక్షల60వేలు ఆర్టీజీఎస్ చేయించుకుని టోపీ పెట్టారు.
ఫ రూ.74 లక్షలు కొట్టేశారిలా..
రాజానగరం మండలం కొంతమూరు గ్రామానికి చెందిన కాదా ఉమాకాంత్ ఆటోమోటివ్ ప్రై వేట్ లిమిటెడ్‌లో అకౌంటెంట్ మేనేజర్. ఆగస్టు 17న స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్ కోసం ఫేస్‌బుక్‌లో వెతికారు. సావర్ట్ ట్రేడింగ్ యాప్ అనే పేరుతో లింక్ రాగా ఓపెన్ చేయగా, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్‌చేయాలని మెసేజ్ వచ్చింది. తర్వాత దఫ దఫాలుగా 11సార్లు మొత్తం రూ.74,36,403 పె ట్టుబడి పెట్టాడు. అమౌంట్ ఫ్రీజ్ అయ్యిందని, విత్‌డ్రా చేయాలంటే మరో రూ.58,55,000 వే యాలని చెప్పడంతో మోసపోయాననే అనుమానంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేశాడు.
ఫ రికవరీ చేశారు..
రాజమహేంద్రవరంలో కె.శ్రీకాంత యా క్సిస్ బ్యాంకు క్రెడిట్‌కార్డు ఎంపిన నెంబరు మర్చిపోయారు. కస్టమర్‌కేర్ నంబరుకోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఓ నకిలీ నంబరు వచ్చింది. దీనికి ఆయన కనెక్ట్ కాగానే అవ తల నుంచి ఓ వ్యక్తి మాట్లాడుతూనే ఓ యాప్ క్రియేట్ చేశాడు. అతను కోరిన వి ధంగా ఓటీపీని చెప్పడంతో రూ.55,999ని సైబర్ నేరగాడు తన ఖాతాకు బదిలీ చే సుకున్నాడు. వెంటనే సైబర్ క్రైం పోలీసు లకు సమాచారం ఇచ్చారు. ఆ సొమ్మును ఫ్రీజ్‌చేసి పదిరోజుల్లో వెనక్కి రప్పించారు.
ఫ తక్షణం ఏమి చేయాలి..
సైబర్ నేరం జరిగి ఖాతాలో డబ్బులు పోతే వెంటనే బ్యాంకు కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి అకౌంట్ ఫ్రీజ్ చేయించాలి. సైబర్‌క్రైం హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫోన్‌చేసి విషయాన్ని తెలియజేయడంతోపాటు నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్‌లో పూర్తి వివరాలు నమోదుచేయాలి. మీ పరిధి పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యా దుచేయాలి. గతంలో గంటలోపు టోల్‌ఫ్రీ నెంబర్‌కి ఫోన చేస్తే డబ్బులు వితడ్రా కాకుండా బ్యాంకు ఫ్రీజ్ చేసేది. ఇప్పుడు నిమిషాల్లోనే నేరగాళ్లు క్రిప్టో కరెన్సీలోని మళ్లించేస్తున్నారు.