ట్రాన్స్‌ఫార్మర్స్ రాగిదిమ్మల చోరీలు... దొరికిన అంతర్ జిల్లా దొంగలు
ABN , Publish Date - Jul 11 , 2025 | 01:21 AM
దేవరపల్లి, జూలె 10 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగిదిమ్మలు దొంగిలించిన అ ంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి పోలీస్ స్టేషన్‌లో గురు వారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఇటీవల విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్‌లోని రాగి వైర్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ, కొవ్వూరు ఎస్‌డీపీవో, రాజమ హేంద్రవరం సీసీఎస్
ముఠా సభ్యులను దేవరపల్లిలో పట్టుకున్న పోలీసులు
రూ.10 లక్షల విలువైన 67 రాగిదిమ్మలు, 2 కార్లు స్వాధీనం
దేవరపల్లి, జూలె 10 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగిదిమ్మలు దొంగిలించిన అ ంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి పోలీస్ స్టేషన్‌లో గురు వారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఇటీవల విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్‌లోని రాగి వైర్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ, కొవ్వూరు ఎస్‌డీపీవో, రాజమ హేంద్రవరం సీసీఎస్ ఆధ్వ ర్యంలో ప్రత్యేక టీమ్‌లు ఏర్పా టు చేశారు. ఆ టీమ్‌లు సాంకే తిక పరిజ్ఞానంతో సీసీ కెమెరాల సహకారంతో నలుగురు అంత ర్ జిల్లాల దొంగలను దేవర ప ల్లి డైమండ్ జంక్షన్ వద్ద గురు వారం అరెస్టు చేసినట్టు తెలి పారు. వారితో పాటు రాగివైరు కొనుగోలు చేసిన ఇద్దరు వ్యా పారులను కూడా అరె స్టు చేసి నట్టు చెప్పారు. వారు తూర్పు గోదావరి, ఏలూరు జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లాల్లో 115 ట్రాన్స్ ఫార్మర్‌లను దొంగిలించారని, వాటి విలువ రూ. 10లక్షలు ఉంటుందని తెలిపారు. చోరీలకు పాల్ప డిన పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండ లం రాయికుదురు గ్రామానికి చెందిన కడలి సతీ ష్, ఏలూరు జిల్లా కృతివెన్ను మండలం లక్ష్మీపు రం గ్రామానికి చెందిన వేండ్రపు దుర్గాశ్రీనివాస్, పశ్చి మగోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన బళ్లా విజయరత్నం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దెయ్యాల దిబ్బ గ్రామానికి చెందిన ఏలూరు పోసియ్యలతో పాటు పాటు చోరీ సొత్తు కొన్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవాని దిబ్బ గ్రామానికి చెందిన పావురాయిల కోటేశ్వరరావు, భీమవరం మండలం దిర్శిమర్రు గ్రామానికి చెందిన సవరపు భీమారావును అరె స్టు చేశామని పేర్కొన్నారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన 67రాగిదిమ్మలను స్వాధీనం చేసు కున్నామని, వాటి విలువ రూ.10 లక్షలు ఉంటు ందని తెలిపారు. వీటితో పాటు 2 కార్లు, 2 మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు గతంలో వివిధ పోలీస్‌స్టేషన్స్‌లో ట్రా న్స్‌ఫార్మర్ నేరాలపై అరెస్ట్ అయ్యి బెయిల్‌పై ఉన్నారని తెలిపారు. కేసును చేధించిన దేవరపల్లి సీఐ బీఎన్‌నాయక్, ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం, రాజ మండ్రి సీసీఎస్ సీఐ శ్రీధర్‌కుమార్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో దేవ రపల్లి విద్యుత్ ఏఈ సీ.వెంకట్రావు పాల్గొన్నారు.