Share News

వరి కోత పనులకు వచ్చి...

ABN , Publish Date - Nov 10 , 2025 | 12:56 AM

గండేపల్లి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యమ్మపాలెం నుంచి సింగరంపాలెనికి ఆదివారం ఉదయం వరి కోత మిషన్‌ను ఐషర్‌ వ్యాన్‌ మీద తీసుకెళ్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌, గం

వరి కోత పనులకు వచ్చి...
మృతదేహాలను పరిశీలిస్తున్న ఎస్‌ఐ

విద్యుత్‌ షాక్‌తో ఇద్దరి మృతి...

మృతులు పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం వాసులు

గండేపల్లి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యమ్మపాలెం నుంచి సింగరంపాలెనికి ఆదివారం ఉదయం వరి కోత మిషన్‌ను ఐషర్‌ వ్యాన్‌ మీద తీసుకెళ్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌, గండేపల్లి ఎస్‌ఐ యువి శివ నాగబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఐషర్‌ వ్యాన్‌ పై వరి కోత మిషన్‌ను తరలిస్తుండగా దారి మధ్యలో 11కెవి విద్యుత్‌ వైర్లు తగిలి డ్రైవర్‌ గెడ్డం సందీప్‌ (20) షాక్‌తో మృతిచెందాడు. ము ందు బండి మీద వెళుతున్న మిషన్‌ యజమాని కరిపెట్టి సింహాద్రి అప్పన్న (53) వెనక్కి వచ్చి ఏ మయిందోనని ఆందోళనతో వ్యాన్‌ను ముట్టుకోగా విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతిచెందిన ఇద్దరు పశ్చిమగోదావరి జి ల్లా ఇరగవరం మండలం పేకేరు, రాపాక గ్రామా లకు చెందినవారు. వరి కోత పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ ఎడమ వైపునకు రావడంతో మిషన్‌ పైన గొట్టం విద్యుత్‌ వైర్లకు తగిలి విద్యుత్‌ సరఫరా అయి నట్టు తెలిపారు. మృతదేహాలను అంబులెన్స్‌లో మార్చురీకి తరలించామన్నారు. రైతుల మోటార్లకు త్రి ఫేస్‌ విద్యుత్తు సరఫరా ఉండడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందన్నారు. సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ శివ నాగబాబు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.

Updated Date - Nov 10 , 2025 | 12:56 AM