వచ్చే రబీ సీజన్‌కు పుష్కలంగా ఎరువులు
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:51 AM
వచ్చే రబీ సీజన్‌లో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు.
అమలాపురం, డిసెంబరు19(ఆంధ్రజ్యోతి): వచ్చే రబీ సీజన్‌లో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. జిల్లాలో 2026-27సంవత్సరానికి సంబంధించి అన్ని పంటలకు అవసరమైన 29,245 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువుల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే 2,015 మెట్రిక్ టన్నుల యూరియా ప్రారంభ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, డిసెంబరు నెలాఖరు వరకు మొత్తం 8,990 మెట్రిక్ టన్నులు అవసరంకాగా, ప్రారంభ నిల్వతో కలిపి 11,923 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతోందని తెలిపారు. డిసెంబరు నెలాఖరుకి మరో 3 వేల మెట్రిక్ టన్నులు వచ్చేనెల జనవరి నుంచి సరఫరా చేయడానికి వీలుగా ఇండెంట్ కోరామని అన్నారు. శుక్రవారం నాటికి 3,794 మెట్రిక్ టన్నుల యూరియా, 2,300 మెట్రిక్ టన్నుల డీఏపీ, 1210 మెట్రిక్ ట న్నుల ఎంవోపీ, 7823 మెట్రిక్ టన్నుల ఎంపీకే కాంప్లెక్సులు, 927 మెట్రిక్ టన్నుల ఎస్‌ఎస్‌పీ ఎరువులు వివిధ గోదాముల్లో సిద్ధంచేశామని తెలిపారు.