Share News

అయినవిల్లి లంకలో మొసలి సంచారం..

ABN , Publish Date - Dec 14 , 2025 | 01:06 AM

అయినవిల్లి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లిలంక వద్ద ఇటుక బట్టీల గుంతల్లో మొసలి సంచరిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. గోదావరికి వచ్చిన వరదల కారణంగా ఎగువ ప్రాంతం నుంచి ఈ మొసలి ప్రవాహంలో కొట్టుకు వచ్చి ఉంటుందని ప్రజలు చెప్తు న్నారు. గుంతలో మొస

అయినవిల్లి లంకలో మొసలి సంచారం..
అయినవిల్లిలంక ఇటుక బట్టీల గుంతల్లో మొసలి

అయినవిల్లి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లిలంక వద్ద ఇటుక బట్టీల గుంతల్లో మొసలి సంచరిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. గోదావరికి వచ్చిన వరదల కారణంగా ఎగువ ప్రాంతం నుంచి ఈ మొసలి ప్రవాహంలో కొట్టుకు వచ్చి ఉంటుందని ప్రజలు చెప్తు న్నారు. గుంతలో మొసలిని చూసి జాలర్లు, రైతులు వణికిపోతున్నారు. ముక్తేశ్వరం రేవు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న మొసలిని పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించే విధంగా చర్యలు చేపడుతున్నట్టు జిల్లా అటవీశాఖ అధికారి ఎంవీవీ ప్రసాద్‌ తెలిపారు. మొసలి తిరిగిన గుంతలను పరిశీలించారు. 2 రోజుల్లో బోను ఏర్పాటుచేసి పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలిస్తామన్నారు. గ్రామంలో ప్రజలు, రైతులను అప్రమత్తం చేశామన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 01:06 AM