రహ‘దారుణాలే’!
ABN , Publish Date - Dec 30 , 2025 | 01:15 AM
ఈ ఏడాది బాలికల అదృశ్యం కేసులు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.. ఒక్కరా ఇద్దరా ఏకంగా 136 మంది అదృశ్యమయ్యారు... ఇప్పటి వరకూ పోలీసులు 133 మంది ఆచూకీ కొనుగొన్నారు.. మిగిలిన ముగ్గురు ఏమయ్యారనేది తెలియదు..
రోజుకు రోడ్డుకు ఇద్దరు బలి
33కు చేరిన బ్లాక్ స్పాట్లు
ప్రమాదాల్లో కాటేసిన నిర్లక్ష్యం
పలు కుటుంబాలు ఛిద్రం
కొత్త పంథాలో సైబర్ నేరాలు
బాలికల అదృశ్యం..ఆందోళన
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
ఈ ఏడాది బాలికల అదృశ్యం కేసులు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.. ఒక్కరా ఇద్దరా ఏకంగా 136 మంది అదృశ్యమయ్యారు... ఇప్పటి వరకూ పోలీసులు 133 మంది ఆచూకీ కొనుగొన్నారు.. మిగిలిన ముగ్గురు ఏమయ్యారనేది తెలియదు.. ఇక రహదారులు రక్తసిక్తమయ్యాయి.. జిల్లాలో ఫిబ్రవరి నెలలోనే అత్యధికంగా 32 ప్రమాదాలు జరిగాయి. సైర్‌నేరాలు పెరిగాయి. రక్తం మరిగిన రోడ్లు జనం ప్రాణాలు తీయడంలో గతేడాదికి ఈ ఏడాదికి పెద్ద తేడా ఏమీ లేదు. బ్లాక్ స్పాట్ల కోరలు పెరుగు తూనే ఉన్నాయి. గంజాయి పొగ గ్రామాల్లోకి పాకి నట్లు కని పిస్తోంది. నాటు సారాకు అడ్డూ అదుపూ లేదు. మరోవైపు సైబర్ నేరగాళ్ల వలకు చదువుకున్న వాళ్లే ఎక్కువగా చిక్కుతుండడం ఆందోళన కలిగిస్తూనే ఉంది. పోలీసులు డ్రోన్ల తో జల్లెడ పడు తున్నా యువత విచ్చల విడితనం సమాజానికి ప్రశ్నార్థకంగా మారింది. గణాంకాల మాటెలా ఉన్నా నేరాలు-ఘోరాల్లో ఈ ఏడాది కొంత మోదం, అంత కంటే ఖేదం మిగిల్చింది.
పగలే ప్రమాదాలు?
జిల్లాలో గత ఏడాది 30 బ్లాక్ స్పాట్లు ఉండగా.. ఈ ఏడాది మరో 3 జత కలిసి మొత్తం 33కి చేరాయి. జాతీయ రహదారిలో 26 బ్లాక్ స్పాట్లు ఉండగా, స్టేట్ హైవేల్లో 4, ఇతర రోడ్లలో 3 ఉన్నాయి. ఈ ఏడాది సుమారు 650 రోడ్డు ప్రమాదాలు చోటు చేసు కోగా 270 మంది ప్రాణాలు బలైపోయాయి. 700 మంది ఆస్పత్రి పాలయ్యారు. రాత్రి వేళ కంటే పగ టిపూటే ప్రమాదాలు ఎక్కువగా జరిగినట్టు గణాం కాలు చెబుతున్నాయి. ఉదయం 6 నుంచి సాయం త్రం 6 గంటలకు వరకూ సుమారు 380, సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకూ దాదాపు 270 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆర్టీసీ బస్సుల వల్ల దాదాపు 19(గతేడాది 24), ప్రైవేటు బస్సులు 9(17), లారీలు 116(114), ట్రాక్టర్లు 11, కార్లు 148(175), ద్విచక్ర వాహనాలు 240(276), ఆటో రిక్షాలు 44(56), ఇతర వాహనాల వల్ల 70(35) ప్రమాదాలు జరిగాయి.
సై‘ఢర్’ క్రైం
ఈ ఏడాది సైబర్ క్రైం కేసులు పెరిగాయి. ఆధునిక సాంకేతికతను పోలీసులు అర్థం చేసుకొనే లోపుగా సైబర్ బూచోళ్లు ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు.పదో తరగతి పాస్ కాని నేరస్తులు ఉన్నత విద్యావంతులను సైతం బురిడీ కొట్టిస్తున్నారు. డిజిటల్ అనే పదాన్ని ఉపయోగించి ఏకంగా అరెస్టులు చేసేస్తున్నారు. బాగా చదువుకున్న వాళ్లు కూడా సులభంగా అరెస్లయి కాలు కదపడం లేదు. ఆర్థిక నేరాలకు సంబంధించి డిజిటల్ అరెస్టు ఓ పెద్ద సమస్యగా పరిణమించింది.జిల్లాలో రోజుకు 10 మంది వరకూ లబోదిబోమంటూ సైబర్ క్రైం సెల్‌కు వస్తున్నారు.సైబర్ క్రైంలో రికవరీ శాతం అతి స్వల్పం. దర్యాప్తు చేయలేని కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. రూ.10 కోట్లు పోగొట్టుకుంటే రూ.లక్ష కూడా వెనక్కి రప్పించలేని పరిస్థితులు ఉన్నాయి.
అమ్మాయిల అదృశ్యం!
ఈ ఏడాదిలో పేకాట కేసులు 400 నమోదు చేసి 1930 మందిని అరెస్టు చేసి రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందేలు 240-890-రూ.13 లక్షలు, డ్రంకెన్ డ్రైవ్ 1140 -రూ.60 లక్షల జరిమానా, బహి రంగ మద్యపానం 12,284 కేసులు, సారా 126 కేసు లు 186 అరెస్టులు, గంజాయి 49 కేసులు 173 మంది అరెస్టు 2600 కిలోల గంజాయి స్వాధీనం, 136 మంది బాలికల అదృశ్యం కేసులు నమోదు కాగా 133 మంది ఆచూకీ కనిపెట్టారు. 22 మంది బాలుర అదృశ్యం కేసులు నమోదు కాగా 20 మంది ఆచూకీ లభించింది. 317 మందిపై రౌడీషీట్లు, 114 మందిపై నేరఅనుమానిత షీట్లు ఓపెన్ చేశారు. సుమారు 40 మందిపై పీడీ యాక్టు బనా యించారు. 430 మంది రౌడీలను బైండోవర్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలపై 53 వేల కేసుల్లో రూ.2.95 కోట్లు జరి మానాలుగా వసూలు చేశారు. వాహనదారులు రోడ్డెక్కా లంటే భయపడేంతగా తనికీలు సాగాయి.
రోడ్డు ప్రమాదాలు
ఏడాది ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు
2023 849 349 869
2024 697 282 902
2025 833 314 599
అదృశ్యం కేసులు
ఏడాది బాలికలు ఆచూకీ లేనివి యువతులు ఆచూకీ లేనివి
2023 136 4 242 77
2024 65 12 109 42
2025 136 3 -- --