Share News

మంచి భర్త.. నాన్నను కాలేకపోయా.. సారీ!

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:28 AM

రాజమహేంద్రవరం సిటీ, జూలై 9(ఆంధ్రజ్యోతి): మంచి నాన్నను కాలేకపోయాను..మంచి భర్తను కాలేకపో యాను.. మంచి కొడుకును కాలేకపోయాను.. సారీ అంటూ ఒక వ్యక్తి క్షణి కావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన మెట్ల కుమా

మంచి భర్త.. నాన్నను కాలేకపోయా.. సారీ!

లెటర్‌ రాసి రిపోర్టర్‌ ఆత్మహత్య

రాజమహేంద్రవరం సిటీ, జూలై 9(ఆంధ్రజ్యోతి): మంచి నాన్నను కాలేకపోయాను..మంచి భర్తను కాలేకపో యాను.. మంచి కొడుకును కాలేకపోయాను.. సారీ అంటూ ఒక వ్యక్తి క్షణి కావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన మెట్ల కుమార్‌ (45) గత దశాబ్ద కాలంగా జర్నలిజంలో ఉన్నారు. తూర్పుగోదా వరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రముఖ దినపత్రికలో గత ఎనిమిదేళ్లుగా క్రైమ్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య గౌరి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాజమహేంద్రవరం బొమ్మూరు నేతాజీ నగర్‌లోని ఎర్రన్నాయుడు హిందీ కళాశాల సమీపంలో అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో మనస్పర్థల కార ణంగా గత నెల 23న ఉదయం 11 గంటల సమయంలో బయటకు నడుచుకుంటూ వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం రైల్వే క్వార్టర్స్‌ రోడ్డులోని ఆలయానికి వచ్చిన వారికి దుర్వాసన రావడంతో 112కు ఫోన్‌ చేసి సమాచారం అందిం చారు. ఈ మేరకు టూటౌన్‌ పోలీసులు వచ్చి పరిశీలించి మృతదేహాం మెట్ల కుమార్‌దిగా గుర్తించారు. మృతదేహం పూర్తిగా పాడైంది. మెట్ల కుమార్‌ బంధువులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో కుటుంబీకులు బోరున విలపించారు. గురువారం పోస్టుమార్టం అనంతరం మెట్ల కుమార్‌ మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తారు. అయితే కుమార్‌ బిర్యానీలో గడ్డిమందు కలిపి తిని ఆత్మహ్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

జేబులో బుక్‌..

మృతదేహం సమీపంలో తన జేబులో పెట్టుకునే పాకెట్‌ బుక్‌ను కవర్‌లో పెట్టి దారంతో కట్టి ఉండడాన్ని గమనించి పోలీసులు ఆ బుక్‌ను ఓపెన్‌ చేసి చూస్తే అందులో కుమార్‌ తన కుటుంబీకుల కోసం రాసుకున్న అఖరి అక్షరాలు కనిపించాయి. మంచి భర్తను కాలేకపోయాను ఐ లవ్‌ యూ గౌరి అని భా ర్యను, మంచి నాన్న కాలేకపోయాను ఐ లవ్‌ యూ చిట్టితల్లి అని కుమార్తెను, బాబు జశ్యంత్‌ అమ్మను చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని కుమారుడుని, మంచి కొడుకును కాలేకపోయానని తన తల్లిదండ్రుల ను, మంచి అల్లుడిని కాలేకపోయాను అని మావయ్యను ఉ ద్దేశించి సారీ అని రాసి ఉంది. నా వాటా ఆస్తిని నా పిల్లలకు చెందేలా చేయాలని చివరిగా రాసుకున్నాడు. బుక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:28 AM