శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించొద్దు
ABN , Publish Date - Oct 08 , 2025 | 01:08 AM
సాధారణ జన జీవనా నికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించ వద్దని ఎస్పీ నరసింహ కిశోర్ ఆదేశిం చారు.
రాజమహేంద్రవరం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): సాధారణ జన జీవనా నికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించ వద్దని ఎస్పీ నరసింహ కిశోర్ ఆదేశిం చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సర్కిళ్ల వారీగా కేసులపై ఆరా తీశారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. రౌడీ షీటర్లు, అసాంఘిక వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నా రు. ఓపెన్ డ్రింకింగ్, డ్రంకెన్ డ్రైవ్‌లపై తనిఖీలు, రాత్రి వేళల్లో గస్తీలు ముమ్మ రం చేయాలన్నారు. అనుమానితుల వేలి ముద్రలను ఎంఎస్‌డీ డివైజ్‌తో చెక్ చేయాలన్నారు. ప్రతి కేసులో సాంకేతిక ఆధారాలు సేకరించడంతో పాటు అందు బాటులో ఉన్న ఆధునిక పద్ధతుల్లో దర్యా ప్తులు చేయాలని చెప్పారు. జిల్లాలోని బ్లాక్ స్పాట్లలో డ్రోన్‌లతో పర్యవేక్షణ చేయాలన్నారు.అనంతరం సేఫ్ దీపావళి పోస్టర్లు విడుదల చేశారు. గత నెలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశా రు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఎన్ బీఎం.మురళీ కృష్ణ,ఏవీ సుబ్బరాజు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.